Vennela Kishore Comments On Sree Vishnu: యంగ్ హీరోలలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో శ్రీవిష్ణు(Sree Vishnu) పేరు లేకుండా ఉండదు. చిన్న చిన్న క్యారెక్టర్స్ ద్వారా కెరీర్ లో నెట్టుకుంటూ వచ్చిన శ్రీవిష్ణు, ఆ తర్వాత హీరో గా మారాడు. హీరోగా మొదట్లో ఈయన సినిమాలను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ, ఆ తర్వాత కొన్నాళ్ళకు చిన్నగా ఆడియన్స్ గుర్తించడం ప్రారంభించారు. ముఖ్యంగా ఈయన కామెడీ టైమింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత ఈయన హీరో గా కూడా వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకొచ్చాడు. ఈయన కెరీర్ ని మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందా అంటే అది ‘సమజవరగమనా’ చిత్రమే. ఈ సినిమా తర్వాత రీసెంట్ గా విడుదలైన ‘సింగిల్'(Single Movie) మూవీ కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
Also Read: ప్రశాంత్ వర్మ కెరియర్ ముగిసినట్టేనా..?
రీసెంట్ గానే ఓటీటీ లో కూడా విడుదలైన ఈ సినిమాకు అక్కడ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం లో డైరెక్టర్ మారుతి(Maruthi), కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore) శ్రీ విష్ణు గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి బాగా వైరల్ అయ్యాయి. మారుతీ మాట్లాడుతూ ‘శ్రీ విష్ణు పైకి చాలా సైలెంట్ గా కనిపిస్తాడు, కానీ ఆయన లోపల మరో వెర్షన్ నడుస్తూ ఉంటుంది’ అని అంటాడు. అప్పుడు వెన్నెల కిషోర్ వెంటనే మైక్ అందుకొని ‘ఆ వెర్షన్ లోపలే ఉంచడం మంచిది. బయటకు వచ్చిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోతుంది’ అని అంటాడు. అప్పుడు అల్లు అరవింద్ ‘ఈమధ్య కూడా రెండు మూడు వదిలినట్టు ఉన్నాడు కదా’ అంటూ కౌంటర్ ఇస్తాడు. అంటే శ్రీవిష్ణు లో ఆ రేంజ్ కామెడీ టైమింగ్ ఉందని వీళ్ళ ఉద్దేశ్యం.
అంతే కాదు శ్రీవిష్ణు ప్రస్తుతం సోషల్ మీడియా లో నడిచే మీమ్స్ ఆధారంగా కూడా జోక్స్ వేస్తూ ఉంటాడు. అలా బాగా పాపులర్ అయినా కన్నప్ప ‘శివయ్యా’ మీమ్ డైలాగ్ కూడా తన సింగిల్ మూవీ లో వాడాడు. కానీ మోహన్ బాబు మరియు మంచు విష్ణు టీం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ డైలాగ్ ని తొలగించారు. ఇంటర్వెల్ లో వచ్చే ‘శివయ్యా’ డైలాగ్ కి బదులుగా ‘భగవంతుడా’ అనే డైలాగ్ ని చేర్చారు. అలా ఆయన మదిలో ఎన్నో ఆలోచనలు, ఫన్నీ జోక్స్ ఉన్నాయి. వాటిని బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ వస్తే మాత్రం ఎలాంటి రియాక్షన్ ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇకపోతే సింగల్ చిత్రం కమర్షియల్ గా 20 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది.