People of Hyderabad: భారతదేశవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉన్నా హైదరాబాద్ లో మాత్రం విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఎండాకాలం, చలికాలంలోనూ వర్షాలు పడుతూ ఉంటాయి. ఎవరైనా వర్షం పడితే ఆనందంగా ఉంటారు. ఆ వాన చినుకులో ఎంజాయ్ చేయాలని చూస్తారు. కానీ హైదరాబాద్ లో మాత్రం వర్షం పడితే నగరవాసులకు నరకం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు అవుతూ ఉంటుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతూ ఉంటాయి. దీంతో రోజుల తరబడి ఇంటి నుంచి బయటకు రాని వారు ఎందరో ఉంటారు. అలాగే వర్షం పడిన నీరు ఎటూ పోలేక రోడ్లపైనే నిలిచి చెరువుల్లా కనిపించిన దృశ్యాలను చూసి షాక్ కు గురవుతూ ఉంటారు. వర్షం పడినప్పుడు ట్రాఫిక్ సమస్యల గురించి తీవ్ర ఇబ్బందుల పడుతూ ఉంటారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయంతో ఇక ఇలాంటి కష్టాలను తీరినట్లేనని అంటున్నారు. ఎందుకంటే?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో రహదారుల నిర్మాణం, బ్యూటికేషన్, వాటర్ హోల్టిండ్ స్ట్రీక్చర్ వంటివి ఉన్నాయి. అయితే వర్షపు నీరు నిల్వతో హైదరాబదీ వాసుల బాధలు అన్నీ ఇన్నీ కావు. ప్రతీ సారి వర్షం వస్తుందంటే బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయిన రోడ్లపై ఉండంతో ప్రయాణం చేయడానికి కష్టంగా మారుతుంది. దీంతో నగరంలో నిల్వకుండా ఉండడానికి వరదనీటి సంపులను నిర్మించనున్నారు.
హైదరాబాద్ లోని 12 ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తారు. ఒక్కో సంపు సామర్థ్యం లక్ష లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లు ఉండనుంది. ఇవి రోడ్లపై నీటిని నిల్వ లేకుండా చేస్తాయి. ఎంత పెద్ద వర్షం కురిసినా వర్షపు నీరు ఈ సంపుల్లోకి వెళ్తుంది. ఆ తరువాత కాలువల ద్వారా బయటకు వెళ్తాయి. రోడ్లపై వరద నీరు ఉండకుండా ఇవి చేస్తాయి. వీటికి మంగళవారం రేవంత్ రెడ్డి శంకుస్తాపన చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నిర్మించిన వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ లో నిర్మాణం పూర్తయిన వాటిని సీఎం ప్రారంభిస్తారు.
వీటితో పాటు హైదరాబాద్ లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ప్రయాణం చేయాలంటే నగరవాసులకు నరకం కనిపిస్తుంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. పెరుగుతున్న జనాభా కోసం వారికి అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. కేబీఆర్ పక్కన ఆరో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు ఉందులో ఉన్నాయి. మొత్తంగా సోమవారం రూ.3667 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో రూ.3550 కోట్లతో రోడ్ల నిర్మాణం, పలు జంక్షన్లలో రూ. కోటి 50 లక్షలతో బ్యూటిపికేషన్ పనులకు శంకుస్తాపన చేస్తారు. హైదరాబాద్ లో హై సిటీ ప్రాజెక్టు పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగంగా సోమవారం ఈ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.