https://oktelugu.com/

Nidhhi Agerwal: పడి లేచిన కెరటం ఈ హీరోయిన్: కెరీర్ అయిపోయింది అనుకుంటే, సూపర్ స్టార్స్ తో ప్రాజెక్టులు కొట్టేసింది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. వాళ్లు కనక ఒకసారి వాళ్ళ సినిమాలతో స్టార్ స్టేటస్ ని అందుకున్నట్లైతే ప్రేక్షకులు సైతం వాళ్లకు నీరాజనాలు పడతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లందరు వాళ్ళకంటూ స్టార్ స్టేటస్ ని అందుకున్న వాళ్లే కావడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : December 3, 2024 / 11:10 AM IST

    Nidhhi Agerwal

    Follow us on

    Nidhhi Agerwal: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ అనేది ఎక్కువ రోజులపాటు సాగదనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక కేరియర్ మొదట్లో చిన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు బరిలోకి దిగుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్లు స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ లను అందుకుంటే స్టార్ హీరోయిన్ గా చలామణి అవ్వచ్చనే ఉద్దేశ్యంతో ఉంటారు. ఇక తన అందంతో టాలెంట్ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూ ముందుకు సాగుతున్న నటి నిధి అగర్వాల్…

    2014 సంవత్సరంలో ‘మిస్ దివా యూనివర్స్ ‘ లో పాల్గొన్న ఆవిడ ఆ తర్వాత 2017 వ సంవత్సరంలో ‘మున్నా మైకేల్’ అనే సినిమాని చేశారు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ ఆమె ఎక్కడా కూడా నిరాశపడకుండా తెలుగులో నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘సవ్యసాచి ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆమెకు గుర్తింపైతే తీసుకురాలేదు. ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను అనే సినిమా చేసింది. ఇక ఇది కూడా పెద్దగా ఆమెకు కలిసి రాలేదు. అయినప్పటికి తను ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో నటిగా తనకు మంచి గుర్తింపురావడమే కాకుండా హీరోయిన్ గా కూడా ఆమె స్టార్ స్టేటస్ ని అందుకోబోతుందనే విషయమైతే అందరికీ అర్థమైంది. ఇక అప్పటినుంచి ఆమె వెను తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది.

    ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈమె నటనకు ఫిదా అయినట్టుగా కూడా కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి.

    అందంలోనూ, అభినయంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ను చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఈ నటి ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆమె ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న ‘రాజాసాబ్ ‘ సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో నటిస్తుంది. వన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఈ సినిమాలో కనిపించినప్పటికి ఆమె పాత్ర చాలా గొప్పగా ఉండబోతుందట. ఈ రెండు సినిమాలు కూడా 2025 వ సంవత్సరంలో రాబోతున్నాయి. ఇక ఈ ఇయర్ లో నిధి అగర్వాల్ హవా భారీ రేంజ్ లో కొనసాగబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.

    ఇక మొత్తానికైతే ఆమె ఎంచుకున్న సినిమాలు ఆమెకు భారీ సక్సెస్ లను సాధించి పెడితే మాత్రం ఆమె ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆమె హిట్లు వచ్చిన పొంగిపోవడం లేదు, ప్లాపులు వచ్చిన కృంగిపోవడం లేదు. కాబట్టి ఈవిడ ఎక్కువ సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…