CM Revanth Reddy: రేషన్‌ దారులకు శుభవార్త… సీఎం రేవంత్‌ కీలక అప్‌డేట్‌!

త్వరలో తెలంగాణలో అర్హులకు ఆరోగ్యశ్రీ కార్డుతో సంబంధం లేకుండా కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : July 5, 2024 4:41 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే అర్హులకు రేషన్‌కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు రేషన్‌కార్డులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఇప్పటికే అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు, పథకాలకు ప్రభుత్వం రేషన్‌ కార్డు తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో అర్హత ఉండి రేషన్‌కార్డు లేనివారు పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త రేషన్‌కార్డుల జారీపై కీలక అప్‌డేట్‌ ఇచ్చారు.

ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా..
త్వరలో తెలంగాణలో అర్హులకు ఆరోగ్యశ్రీ కార్డుతో సంబంధం లేకుండా కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. రైతులు పండించిన సన్నబియ్యాన్ని మిల్లింగ్‌ చేయించి.. రేషన్‌ కార్డు ద్వారా పేదలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. సన్న బియ్యం ఇస్తే పేదలు తింటారు కాబట్టి రీసైక్లింగ్‌కు అవకాశం ఉండదని పేర్కొంటున్నారు.

ఇటీవలే ‘పొన్నం’ కూడా..
ఇదిలా ఉంటే కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై ఇటీవలే రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా మాట్లాడారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు. కొత్త రేషన్‌ కార్డులు కూడా త్వరలోనే జారీ చేస్తామని ప్రకటించారు. రైతుల పంట రుణాలు మాఫీ చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్య, వైద్యం, రైతుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ సర్కార్‌ కృషి చేస్తుందని వివరించారు. తెలంగాణలో 26 వేల పాఠశాలలను రూ.1,100 క ఓట్లతో అభివృద్ధి చేశామని తెలిపారు.