TG Rythu Bharosa: తాము అధికారంలోకి వస్తే రైతులకు ఇస్తున్న రైతుబంధు పథకం స్థానంలో రైతు భరోసా కింది ఏటా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఏడాది గడిచినా రైతు భరోసా అమలు కాలేదు. దీంతో అటు విపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. మరోవైపు రైతులు కూడా ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మంత్రివర్గ ఉపసంఘం(Cabinate Sub-commitee) ఏర్పాటు చేసి ఏయే భూములకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి. ఎన్నెకరాలకు ఇవ్వాలని చర్చలు జరిపింది. జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. కానీ, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా అనేక సమావేశాలు నిర్వహించిన కమిటీ.. చివరకు సాగు యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. ఉప సంఘం సూచనను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. దీంతో సాగు యోగ్యమైన భూముల్లో పంటలు వేసినా వేయకపోయినా రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకు జనవరి 26 ముహూర్తం నిర్ణయించారు. ఇదే సమయంలో సాగు భూములు కానివాటి లెక్క తేల్చారు. ఈమేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
1.49 కోట్ల ఎకరాలకు భరోసా..
సాగుకు అనుకూలమైన భూములకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో గత వానాకాలం సాగు చేసిన భూముల వివరాలను వ్యవసాయ శాక(Agricultar department) నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. దీని ఆధారంగానే రైతు భరోసా చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు జనవరి 26న రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే అవకావం ఉందని సమాచారం. ఈమేరకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.
3 లక్షల ఎకరాలకు రాదు..
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం సాగు యోగ్యం కాని గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలు సేకరించింది. ఇలాంటి భూములు 3 లక్షల ఎకరాలు ఉన్నట్లు తేలింది. వాటి సర్వే నంబర్లను కూడా అధికారుల బ్లాక్ చేశారు. మిగిలిన 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా కోసం రూ.8,800 కోట్లు అవసరమని ప్రభుత్వం నిర్ధారించింది. ఈమేరు నిధులు సేకరించే పనిలో ఆర్థిక శాఖ నిమగ్నమైంది.
మార్గదర్శకాలు ఇవీ..
– రైతు భరోసా కింద సాగు యోగ్యమైన వ్యవసాయ భూమికి ఏటా రూ.12 వేలు చెల్లిస్తుంది.
– సాగు యోగ్యమైన భూమిలో పంటలు వేసినా వేయకపోయినా రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇందకు ధరణి, భూమాత పోర్టల్‌లో నమోదైన ఖాతాల ఆధారంగా చెల్లిస్తారు.
– ఆర్వోఎఫ్‌ఆర్(ROFR) పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులే.
– ఆర్బీఐ నిర్వహించే డీబీటీ(DBT) పద్ధతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
– రైతుభరోసా పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారు.
– ఎన్‌ఐసీ(NIC) హైదరాబాద్ భాగస్వామిగా రైతు భరోసా ఆపరేషన్స్‌ను నిర్వహిస్తారు.