HomeతెలంగాణCongress: కాంగ్రెస్ లోకి భారీ వలసలు.. బీఆర్ఎస్ కు వరుస షాక్ లు

Congress: కాంగ్రెస్ లోకి భారీ వలసలు.. బీఆర్ఎస్ కు వరుస షాక్ లు

Congress: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు తగుతులున్నాయి. ఇటీవలే ఒకసారి నలుగురు ఎమ్మెల్యేలు, మరోసారి ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వారు సీఎంవోకు వెళ్లే వరకు ఎవరికీ తెలియదు. ఇక తర్వాత, నాలుగు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌కు చెందిన పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ వెంకటేశ్‌నేత కాంగ్రెస్‌లో చేరారు. అధికారం కోల్పోవడంతో పట్టు కోల్పోతున్న గులాబీ దళంలోంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అధికార పార్టీలో చేరుతున్నారు. తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితోపాటు వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఎంపీ టికెట్‌ హామీతో..
పట్నం మహేందర్‌రెడ్డి చేవెళ్ల ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో టికెట్‌ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్లు ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయం వారిదన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో చేరే విషయంపై మాత్రం తనకు చెప్పలేదన్నారు.

మర్యాద పూర్వకమే అంటూ..
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి చేరాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఈమేరకు సీఎంతో భేటీ అవుతున్నారు. అయితే తర్వాత మర్యాదపూర్వకంగానే కలిశామని చెబుతున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసమే అనేది వాస్తవం. గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు. మరుసటి రోజు నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని చెప్పారు. తర్వాత రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కలిశారు. ఆయన కూడా నియోజకవర్గ డెవలప్మెంట్‌ కోసమే అన్నారు.

పట్నం.. చేరిక కన్ఫామ్‌..
అయితే పట్నం మహేందర్‌రెడ్డి దంపతులతోపాటు ఆయన కుమారుడు కూడీ సీఎంను కలిసినవారిలో ఉన్నారు. పట్నం దంపతులు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. మహేందర్‌రెడ్డి ప్లామెంటు ఎన్నికల్లో చేవెళ్ల టికెట్‌ ఆశిస్తున్నారు. దీనిపై సీఎం కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గులాబీ దండు ఖాళీ..
అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం దంపతులు కాంగ్రెస్‌ పార్టీ లో చేరాలనుకున్నారు. అప్పుడు సీటు ఇవ్వకోవంతో మహేందర్‌ రెడ్డిని ఎమ్మెల్సీని చేసి మంత్రిపదవి ఇవ్వడంతో చల్లబడ్డారు. తాజాగా చేరిక ఖాయమని అంటున్నారు. పట్నం దంపతుల వెంట జిల్లాలో చాలా మంది బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరతారని అంటున్నారు. దీంతో జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని పలువురు పేర్కొంటున్నారు.

కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలో..
తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్‌లో కూడా బీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. ఇప్పటికే వరుసగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని కలుస్తున్నారు. 20 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని మాజీ ఎమ్మెల్యే జెగ్గారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్‌ నియోజకవర్గంలోనే బీఆర్‌ఎస్‌ నేతలు గులాబీ బాస్‌కు షాక్‌ ఇచ్చారు.

తూప్రాన్‌ మున్సిపాలిటీలో..
తూప్రాన్‌ మున్సిపాలిటీలో ఏడుగురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ వ్యవహార శైలిపై, బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ హయాంలో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై వారంతా ఆరోపణలు చేశారు. ఒకవైపు కేసీఆర్‌ పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఉత్సాహం నింపేందుకు యత్నిస్తుండగా, నేతలు షాక్‌లు ఇస్తుండడం చర్చనీయాంశమైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular