Crime News : రంగారెడ్డి జిల్లా మాజీ అదనప కలెక్టర్ భూపాల్ రెడ్డి మంగళవారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత ఆయన గురించి పోలీసులు ఆరా తీస్తుంటే.. ఆయన ఆస్తులను తవ్వితీస్తుంటే దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు కనిపిస్తున్నాయి.. భూపాల్ రెడ్డి ఎల్బీనగర్ లోని ఇందూ అరణ్య గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో ఏకంగా 5.5 కోట్ల నగదు, స్థిరాస్తుల దస్తావేజులు, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం సూర్యాపేట, మిర్యాలగూడ, సాగర్ రింగ్ రోడ్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతకు ముందు నిర్వహించిన తనిఖీలలో భూపాల్ రెడ్డి అక్రమ ఆస్తుల బాగోతం బయటపడింది. ఆయన తన ఇద్దరు అల్లుళ్ళ పేరు మీద 32చోట్ల ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 4.19 కోట్లు ఉంటుందని.. మార్కెట్ ప్రకారం అంచనా వేస్తే 30 కోట్ల కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. రెవెన్యూ విభాగంలో పనిచేయడం వల్ల భూపాల్ రెడ్డి తన బుర్రకు భలేగా పదును పెట్టారు. తన కుటుంబ సభ్యుల పేర్లుతో ఆస్తులను కొనుగోలు చేసి..వారంతా ఆయనకు బహుమతి ఇచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న ఇందూ అరణ్యలోని రెండు విల్లాల్లో ఒకటి బహుమతిగానే వచ్చినట్టు భూపాల్ రెడ్డి చూపించారు. అయితే ఇటీవల మరొక విల్లా ను ఆయన ఇతరులకు విక్రయించారు.
ధరణి ద్వారా సంపాదించారు
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ను భూపాల్ రెడ్డి తనకు కాసులు కురిపించే యంత్రంగా మార్చుకున్నారు. ధరణి పోర్టల్ పాలను సరి చేయడానికి.. భూ కేటాయింపులపై నిర్ణయాలు తీసుకోవడానికి భూపాల్ రెడ్డి భారీగానే డబ్బులు వసూలు చేశారట. తన ఇద్దరు అల్లుళ్ళ పేరుమీద సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ ప్రాంతాలలో ఏకంగా 16 ప్లాట్లను కొనుగోలు చేశారట. ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదరులు ఈ విషయం వెలుగు చూసింది.. అయితే ఫ్లాట్ల కొనుగోలుకు సంబంధించి ఏసీబీ అధికారులు భూపాల్ రెడ్డి అల్లుళ్లకు ఫోన్ చేయగా పొంతన నేను సమాధానం చెప్పారు. అయితే తన అల్లుళ్ళ పేరు మీద కొనుగోలు చేసిన ప్లాట్లలో కొన్నింటిని తన పేరు మీద గిఫ్ట్ డీడ్ గా మార్చుకునేందుకు భూపాల్ రెడ్డి కొంతకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. భూపాల్ రెడ్డి రెండు నెలల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఇటీవల ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. రెండు నెలల క్రితం ముత్యం రెడ్డి అనే రైతు తన పొలంలో 14 గుంటలు నిషేధిత జాబితాలో ఉందని.. దానిని ఆ జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకోగా.. భూపాల్ రెడ్డి 8 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ముత్యం రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో భూపాల్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అయితే ప్రభుత్వం భూపాల్ రెడ్డికి ప్రతినెల జీతం ఇస్తున్నప్పటికీ.. ఒక రూపాయి కూడా అందులో నుంచి ఆయన విత్ డ్రా చేయకపోవడం ఏసీబీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు భూపాల్ రెడ్డి కలెక్టరేట్ లో ఒక ఉద్యోగి ద్వారా లంచాలు వసూలు చేయించాడని ఏసీబీ అధికారుల పరిశీలనలో తేలింది.