ఢిల్లీలో సిద్ధిపేట ఎయిర్ పోర్టు గురించి మరిచిపోయారా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లలో మూడు రోజుల పాటు పర్యటించి తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కేంద్రమంత్రులతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో సమావేశమై రాష్ట్రంలో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులను కోరుతూ ఇక్కడున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రధానమంత్రిని కోరారు. దీంతో కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రిసైతం కేసీఆర్ విన్నపాలపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పర్యటనను ముగించుకొని హైదరాబాద్ కు పయనమయ్యారు. కాగా కేసీఆర్ కేంద్రమంతులను గానీ, ప్రధానిని గానీ […]

Written By: NARESH, Updated On : December 13, 2020 3:54 pm
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లలో మూడు రోజుల పాటు పర్యటించి తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కేంద్రమంత్రులతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో సమావేశమై రాష్ట్రంలో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులను కోరుతూ ఇక్కడున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రధానమంత్రిని కోరారు. దీంతో కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రిసైతం కేసీఆర్ విన్నపాలపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పర్యటనను ముగించుకొని హైదరాబాద్ కు పయనమయ్యారు. కాగా కేసీఆర్ కేంద్రమంతులను గానీ, ప్రధానిని గానీ కలిసేటప్పడు ఏ ఒక్క ఎంపీనీ వెంట తీసుకెళ్లలేదు.

Also Read: ఢిల్లీ పొగలు.. బల్దియా సిగలో కమలం?

అయితే ఇటీవల కేసీఆర్ సిద్ధిపేటలో పర్యటించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు ఐటీ హబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. సిద్ధిపేటకు త్వరలో ఏయిర్ పోర్టు తీసుకొస్తామని చెప్పారు. సిద్ధిపేట జిల్లాను అన్ని రకాలుగా అభివ్రుద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో తెలంగాణలోని ఆరు ఏయిర్ పోర్టుల అభివ్రుద్ధి చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హార్దిప్ సింగ్ ను కోరారు. అందులో రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్, వరంగల్ లోని మూమునూరు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ జిల్లా గుడిబండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎయిర్ పోర్టుల గురించి కేసీఆర్ వివరించినట్లు తెలుస్తోంది.

కానీ సిద్ధపేట ఎయిర్ పోర్టు ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో సోషల్ మీడియాలో కేసీఆర్ పై వ్యతిరేకంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లగానే సిద్ధపేట ఎయిర్ పోర్టు గురించి ఏదైనా ప్రకటన వస్తుందని జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఆ ప్రస్తావన రాకపోవడంతో నిరాశ చెందారు. దీంతో సిద్ధిపేట సభలో ఎయిర్ పోర్టు గురించి మాట్లాడాల్సిన అవసరమేంటని కొందరు రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు.

Also Read: బీజేపీకి బంపరాఫర్ ఇస్తున్న కేసీఆర్.. వ్యూహంలో భాగమేనా?

ఇక ప్రతీ ఏయిర్ పోర్టుకు 150 కిలోమీటర్ల వ్యవధి ఉండాలని జీఎంఆర్ తో ఉమ్మడి రాష్ట్రంలో ఓ ఒప్పందం జరిగింది. శంషాబాద్ విమానాశ్రయానికి సిద్ధిపేటకు 150 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఎయిర్ పోర్టు నిర్మించే అవకాశమే లేదు. దీంతో ఢిల్లీలో అందుకే సిద్ధిపేట ఎయిర్ పోర్టు విషయం ప్రస్తావించలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలాంటప్పుడు సిద్ధిపేట సభలో ప్రజలను సంతోషపెట్టడానికే ఎయిర్ పోర్టు గురించి మాట్లాడారా..? అని చర్చించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్