Telangana Crime News: మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్నారో సినీకవి. మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. అంతా జంతువుల మాదిరే ప్రవర్తిస్తున్నారు. మనిషిలో రాక్షసుడు ఉన్నాడని చెబుతున్నారు. సాటి మనిషిని తన కోరిక తీర్చేందుకు ఉపయోగించుకోవడం చూస్తున్నాం. అమ్మకు అన్నయ్యను మేనమామ అంటారు. కానీ ఇక్కడ ఆ మేనమామే ఆమె పాలిట ఓ దుర్మార్గుడిలా మారాడు. కొడుకు చనిపోతే ఆమెను కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేయాలని చూడటం దారుణం.

కోడలును కూతురులా చూసుకోవాల్సింది మామ. కానీ ఆ మామే ఆమె పాలిట శాపంగా మారాడు. తన కోరిక తీర్చాలని నిత్యం వేధింపులకు గురిచేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. కొడుకు చనిపోవడంతో కోడలును బాగా చూసుకోవాల్సిన అతడి కన్ను ఆమె శరీరంపై పడింది. దీంతో తన కామవాంఛ తీర్చాలని నిత్యం గొడవ పడేవాడు. విషయం పెద్దది కావడంతో ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. మేనమామ తీరుకు వారు నిలదీశారు. దీంతో అతడు వారిపై హత్యాయత్నం చేయడం గమనార్హం.
Also Read: చరణ్ సినిమాలో సీఎంగా ‘సూర్య’
ఖమ్మం జిల్లా చింతకాని రైల్వే క్వార్టర్స్ లో నివాసం ఉండే ఓ కుటుంబంలో తన చెల్లెలి కూతురును కొడుకుకు ఇచ్చి వివాహం చేశారు. వారి సంసారం సజావుగా సాగినా విధి వక్రీకరించింది. ఆమె భర్తను కబలించింది. దీంతో ఆమె కుమిలిపోయింది. ఇదే అదనుగా భావించిన మామ తన కోరిక తీర్చాలని నిత్యం ఆమెతో గొడవపడేవాడు. దీంతో ఆమె ఏం చేయాలో అర్థం కాక తల్లితో విషయం చెప్పింది. మామ దుర్బుద్ధిని వివరించిది. దీంతో వారు ఆగ్రహానికి గురయ్యారు.

దీంతో కోపోద్రిక్తుడైన మామ కోడలిపై దాడికి యత్నించాడు. కానీ ఆమె తప్పించుకోవడంతో తల్లికి రెండు కత్తిపోట్లు తగిలాయి. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలయింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు మామ అఘాయిత్యంపై కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కూతురులా చూసుకోవాల్సిన మామ ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Also Read: సినీనటుడు ప్రకాశ్ రాజ్ కు పదవి ఖాయమేనా?