Benefits of Bilva Tree: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల వృక్షాలు మొక్కలు సమానంగా భావించి వాటికి పెద్ద ఎత్తున పూజలు చేస్తాము. అలాంటి దైవ సమానమైన మొక్కలు మన ఇంటి ఆవరణంలో పెరిగితే ఎంతో శుభప్రదం అని కూడా భావిస్తారు. అలా దైవ సమానంగా భావించే వాటిలో బిల్వ వృక్షం ఒకటి. ఇలా బిల్వ వృక్షాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్వరూపంగా భావించి బిల్వ పత్రాలతో స్వామి వారిని పూజిస్తారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఈ బిల్వ పత్ర వృక్షం మన ఇంటి ఆవరణంలో పెరగడం వల్ల ఏవిధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…..

Also Read: వైఎస్ వివేకా కేసు: చిక్కుల్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి?
పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రం మన ఇంటి ఆవరణంలో ఉంచడం ఎంతో మంచిది. ఈ బిల్వ పత్రాన్ని తులసి కోట దగ్గర పెంచడం వల్ల శుభం కలుగుతుంది. ఇక ఈ బిల్వపత్రాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటంవల్ల 108 శివలింగాలను దర్శించుకున్న పుణ్య ఫలితం దక్కుతుంది. అదేవిధంగా ఎంతో మందికి అన్నదానం చేసిన ఫలితం దక్కుతుంది. ఇలాంటి ఎంతో పవిత్రమైన ఈ బిల్వ వృక్షం మన ఇంటి ఆవరణంలో పెంచడం శుభానికి సంకేతం.
అయితే ఈ బిల్వదలాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో మహా బిల్వం, తీగల బిల్వం, కర్పూర బిల్వం, సిద్ధ బిల్వం అనే బిల్వదళాల వృక్షాలు ఉన్నాయి. అయితే వీటన్నింటిలో కెల్లా మూడు పత్రాలు కలిగిన బిల్వవృక్షం ఎంతో శ్రేష్టమైనది. ఈ వృక్షం కనుక మన ఇంటి ఆవరణంలో ఉండి ఈ బిల్వదళాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం అర్చన చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు.
Also Read: ఏపీలో జవహర్ రెడ్డిదే అంతా నడుస్తోందా?
Recommended Video: