Namasthe Telangana: ఇది మొన్న మనం చెప్పుకున్నదే. ఇప్పుడు త్వరలో అమలులోకి రానుంది. మొన్నటిదాకా అధికారిక పత్రికగా చలామణి అయిన నమస్తే తెలంగాణ లో ఉద్యోగుల తీసివేత ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.. అధికారం పోయింది. కెసిఆర్ హ్యాట్రిక్ కల చెదిరిపోయింది. పైగా తనకు ఆరోగ్యం బాగోలేక విశ్రాంతి తీసుకుంటున్నాడు. అసెంబ్లీలో తొలిరోజు కేటీఆర్, హరీష్ రావు మెరుపులు మెరిపించినప్పటికీ అవేవీ నమస్తే తెలంగాణను ఒడ్డున పడితే ఛాయలు కనిపించడం లేదు. పైగా ఆ పత్రిక సీనియర్ ఉద్యోగులకు వాట్సాప్ లో మెసేజ్ లు వస్తున్నాయి. నమస్తే తెలంగాణ దినపత్రికలో 20% ఉద్యోగులను తగ్గిస్తున్నామని.. ఇక ఈ ఉదయం మీ సేవలు అవసరం లేదని కొంతమందికి ఆల్రెడీ యాజమాన్యం వర్తమానం పంపింది. అయితే ఎవరెవరిని వద్దని చెప్పారో వారిలో.. ఒకరినొకరు సంప్రదించుకుంటూ ఏం చేయాలో తెలియని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వాస్తవానికి నమస్తే తెలంగాణ పత్రికను లక్ష్మీరాజ్యం ప్రారంభిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దానిని మెల్లిమెల్లిగా లాక్కున్నాడు. ఉద్యమ పత్రికను కాస్త గులాబీ కరపత్రం చేశాడు. అంతేకాదు తనకు నచ్చని ప్రతిపక్షాల మీద రోజుకు లీటర్ల కొద్ది బురద చల్లాడు. ఇప్పుడు అంటే తెలంగాణలో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నమస్తే తెలంగాణ బ్యానర్ వార్తగా ప్రయారిటీ ఇస్తోంది.. అయితే గతంలో ఎలాంటి వార్తలు ప్రచురించిందో మనందరికీ తెలిసిందే.
అధికారం పోయింది కాబట్టి మొన్నటిదాకా అధికారిక పత్రికగా చలామణి అయిన నమస్తే తెలంగాణలో ఉద్యోగుల కత్తిరింపు ప్రారంభమైంది. దీనికి వ్యతిరేకంగా అల్లం నారాయణ పోరాడుతాడా? ఇన్నాళ్లపాటు కేసీఆర్ పై చూపించిన విధేయతను ఒక్కసారిగా వదులుకుంటాడా? గతంలో కొన్ని మీడియా సంస్థలపై పోరాడినట్టు తన యూనియన్ కేసీఆర్ కు వ్యతిరేకంగా పిడికిలి బిగించగలదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో తనమీద, తన పార్టీ మీద కొన్ని పనులు లీటర్ల తన పార్టీ మీద కొన్ని టన్నులకొద్ది విషం చిమ్మిన నమస్తే తెలంగాణపై రేవంత్ రెడ్డి ఒక్క చూపు చూస్తే చాలు దాని అసలు స్వరూపం బయటపడుతుంది. అసలు దాని సర్కులేషన్ ( ఏబీసీ పరిధిలో లేదు అంటారు), దాని ప్రభుత్వ యాడ్ టారిఫ్ కనుక తవ్వితే అంతే సంగతులు. అంతేకాదు 2017_ 2018 కాలానికి తెలంగాణ ప్రభుత్వ ప్రకటన ఆదాయం గత సంవత్సరపు ఆదాయంతో పోల్చితే 387.4% పెరిగింది. తెలంగాణ టుడే (ఇది కూడా కేసీఆర్ దే) ఆంగ్ల పత్రిక 1749.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది.. ఉద్యమ పత్రికగా ప్రారంభమైన నమస్తే తెలంగాణ ప్రస్థానం కేసీఆర్ చతుర్లకు వచ్చిన ఉద్యమ పత్రికగా ప్రారంభమైన నమస్తే తెలంగాణ ప్రస్థానం కేసీఆర్ చతుర్లకు ఉద్యమ పత్రికగా ప్రారంభమైన నమస్తే తెలంగాణ ప్రస్థానం కేసీఆర్ చేతుల్లోకి వచ్చిన తర్వాత గులాబీ కరపత్రంగా మారింది. అంతేకాదు ఈ పేపర్ సర్కులేషన్ బాధ్యతను ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల మీద వేయడమే అసలైన విచిత్రం. చివరికి ఎన్నికల సమయంలో ఉచిత కాపీలు కూడా వేశారు. కానీ ఇప్పుడు ఆ సప్లై ఆగిపోయినట్టు తెలుస్తోంది. కెసిఆర్ పార్టీని ఇలాగు జనం తిరస్కరించారు.. కాబట్టి ఇప్పుడు ఆ పత్రిక తమకు గుదిబండలా మారిందని దాని యాజమాన్యం ఆలోచిస్తున్నది.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి భారత రాష్ట్ర సమితి నాయకులకు నమస్తే తెలంగాణ పత్రిక అనేది కచ్చితంగా అవసరం. ప్రభుత్వంపై పోరాడాలని భారత రాష్ట్ర సమితికి ప్రతిపక్ష బాధ్యతను ప్రజలు అప్పగించారు. అలాంటప్పుడు ఆ ప్రతిపక్షానికి ఒక బలమైన వాయిస్ కావాలి. ఆ అవసరం నమస్తే తెలంగాణ కచ్చితంగా తీర్చగలగాలి. అధికారం పోగొట్టుకొని 15 రోజులు కాకముందే కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నారంటే ఆ యాజమాన్యాన్ని ఏమనుకోవాలి. ఇన్నాళ్లపాటు ప్రభుత్వ ప్రకటనలను అడ్డగోలుగా తీసుకున్న ఆ యాజమాన్యం కనీసం 15 రోజులు అధికారం లేకుండా ఉండ లేదా? ఇన్ని రోజులపాటు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించలేదా? వాస్తవానికి ఈ కోతలు ఇప్పట్లో ఆగవని అంటున్నారు. భవిష్యత్తులో అత్యంత కఠిన నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు, ఆంధ్రాలో పార్టీని స్థాపించినప్పుడు.. అక్కడ రాజకీయ అవసరాల దృష్ట్యా నమస్తే ఆంధ్ర అనే పత్రికను కూడా స్థాపించాలని అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం మధ్యలోనే ఓడిసిపోయింది. ఒకవేళ ఆ పత్రికను స్థాపించి గనుక ఉండి ఉంటే ఎంతోమంది పాత్రికేయుల జీవితాలు రోడ్డున పడేవి. వాస్తవానికి ప్రస్తుతం ప్రింట్ మీడియా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇకముందు బాగుంటుందనే గ్యారెంటీ లేదు. మొన్నటి ఎన్నికల్లో ఒకవేళ వివేక్ గెలవక పోయి ఉండి ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే కచ్చితంగా వెలుగు పత్రిక మూతపడి ఉండేది. నిజానికి ఆ పత్రిక పరిస్థితి కూడా బాగోలేదని అంటున్నారు. ఇక సాక్షి పరిస్థితి కూడా ప్రస్తుతానికి బాగున్నప్పటికీ.. రేపటినాడు దాని యవ్వారం ఏమిటో అంత చిక్కడం లేదు. కాకలు తీరిన ఈనాడే యాడ్ టారిఫ్ ధర తగ్గిస్తోంది. ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం సంపాదించుకునేందుకు కిందా మీద పడుతుంది. కాకపోతే ఇంతటి దురవస్థను నమస్తే తెలంగాణ ఎప్పుడూ ఎదుర్కోలేదు. అన్నట్టు ఆ మధ్య జీతాల పెంపతుల కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని డెస్క్ సబ్ ఎడిటర్లు ఆందోళన కూడా చేశారు.. అధికారంలో ఉన్నప్పుడే డెస్క్ పాత్రికేయుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించనప్పుడు.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయగలుగుతుంది.. అడ్డగోలుగా ఉద్యోగులను తొలగించడం తప్ప.. ప్రతిపక్షంగా పోరాడవలసిన సమయంలో.. తనకు ఒక మౌత్ పీస్ గా భావించాల్సిన సందర్భంలో.. నమస్తే తెలంగాణను భారత రాష్ట్ర సమితి ఎందుకు కత్తిరించుకుంటుందనేదే అంత చిక్కడం లేదు.