Rashi Phalalu: ఈ రాశి గల రాజకీయ నాయకులకు అనుకూల ఫలితాలు..

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 18న మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కర్కాటకం, కన్య రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మేషరాశి: ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని పొరపాట్లు చేస్తారు. సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాలపై చర్చిస్తారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలు. వృషభం: కుటుంబంలో ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు […]

Written By: Suresh, Updated On : December 19, 2023 10:23 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 18న మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కర్కాటకం, కన్య రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని పొరపాట్లు చేస్తారు. సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాలపై చర్చిస్తారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలు.

వృషభం:
కుటుంబంలో ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు చేపట్టేవారికి ప్రయోజనాలు అందుతాయి. సాయంత్రం విహార యాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు.

మిథునం:
కొందరు మిత్రులు శత్రువులుగా మారొచ్చు. అందువల్ల ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:
మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అయితే పెండింగులో ఉన్న పనులు పూర్తి కానందున నిరాశతో ఉంటారు.

సింహ:
ఆరోగ్య సమస్యలు దరిచేరుతాయి. భవిష్యత్ గురించి కొత్త ప్రణాళికలు వేస్తారు. తండ్రి ఆరోగ్య సమస్యపై శ్రద్ధ పెడుతారు. విద్యారంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయం సాధిస్తారు.

కన్య:
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామికి బహుమతిని అందిస్తారు. గతంలో ఉన్న గొడవలు నేటితో ముగుస్తాయి. వ్యాపారులకు అనుకూల సమయం.

తుల:
రాజకీయ రంగాల వారికి అనుకూల ఫలితాలు. ప్రభుత్వ ఉద్యోగులు ఇతరులతో వాగ్వాదానికి దిగొద్దు. లేకుంటే ప్రమోషన్ ఆగిపోతుంది. ఉద్యోగులు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:
వ్యాపారంలో కొన్ని మార్పులు చేసుకుంటే భారీ లాభాలు వచ్చే అవకాశం. డబ్బు విషయంలో ఎవరితో వాదనలకు దిగొద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:
కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చిస్తారు. భవిష్యత్ గురించి ప్రణాళిక వేస్తారు. అది సక్సెసఅయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

మకర:
ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఇతరుల నుంచి డబ్బు సాయం అందదు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం.

కుంభం:
కొన్ని ముఖ్యమైన విషయాలపై పెద్దలతో చర్చిస్తారు. దీంతో పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

మీనం: కొంతకాలంగా కోరుకుంటున్న విలువైన వస్తువులు పొందుతారు. బంధువులతో వివాదాలుంటే నేటితో ముగుస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ రంగం వారికి అనుకూల ఫలితాలు.