Pallavi Prashanth Case: టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్ నుండి దూరమయ్యేలా ఉంది. ఆయన లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. పల్లవి ప్రశాంత్ అభిమానుల అత్యుత్సాహం తో పాటు అతడు చేసిన ఓ పని సమస్యలకు దారి తీసింది. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న ముగిసింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది. దాంతో అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు.
అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. బూతులు తిట్టారు. అతి కష్టం మీద అమర్ దీప్ అక్కడ నుండి బయటపడగలిగాడు. బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్ కారుపై కూడా దాడి జరిగింది. ఆమె కారు అద్దాలు పగలగొట్టారు. ఆర్టీసీ బస్సుల మీద అటాక్ జరిగింది. ఒక గందరగోళ వాతావరణం చోటు చేసుకోగా… పోలీసులు రంగంలోకి దిగారు. జనాలను చెదరగొట్టారు. పల్లవి ప్రశాంత్ అక్కడ నుండి విజయయాత్ర చేయాలి అనుకున్నాడు. పోలీసులు మాత్రం వెంటనే వెళ్ళిపోవాలి. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చెప్పారు.
ఒకసారి పంపేశాక మరలా పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు పోలీసుల ఆంక్షలు ఉల్లఘించాడు. అతని ఫ్యాన్స్ ఇతర కంటెస్టెంట్స్ మీద దాడి చేశారు. పబ్లిక్ ప్రాపర్టీ నాశనం చేశారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ తో పాటు అతని అభిమానుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవుతాడని ప్రచారం జరుగుతుంది. అతని మీద పలు సెక్షన్ క్రింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం తప్పదు అంటున్నారు.
దీంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ కామనర్ హోదాలో హౌస్లో అడుగుపెట్టి టైటిల్ గెలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టి టైటిల్ కొట్టాడు. టాప్ సెలెబ్స్ తో పోటీ పడిన ప్రశాంత్ తన ఆట తీరుతో అభిమానులను సంపాదించాడు. టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షల ప్రైజ్ మనీ, రూ. 15 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్, ఒక కారు బహుమతిగా పొందారు. పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ గా మరో రూ. 15 లక్షలు గెలుచుకున్నట్లు సమాచారం.