Drunken Driving: న్యూయర్ వేడుకల్లో భాగంగా ఈ రెండు మూడు రోజులపాటు ట్రాఫిక్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ను పాటిస్తున్నారు. పొరపాటున ఎవరైనా మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ పోలీసులు చాలా క్లారిటీ గా చెప్పారు. ఇక వాళ్ళ ఆల్కహాల్ పర్సంటేజ్ ను బట్టి ఫైన్స్ వేయడమే కాకుండా వాళ్ళ లైసెన్స్ సైతం రద్దు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఇలాంటి సందర్భంలో మందు బాబులకు చాలా పెద్ద చిక్కొచ్చు పడిందనే చెప్పాలి. నిజానికి ఎంత తాగితే ఫైన్ పడుతుంది అనే విషయం మీద ఎవరికి క్లారిటీ లేదు. కొంతమంది నేను తాగింది ఒక్క బీరే కదా అని! మరికొందరు నేను ఒక్క పెగ్గు తగను ఏం కదా లే అని బండి తీసుకొని బయలుదేరుతుంటారు. ఇక మందు తాగి పోలీసులకు దొరికితే అప్పుడు ఆ మందు బాబు ఉన్న పొజిషన్ ను బట్టి ఆల్కహాల్ వాళ్ళ బ్లడ్ లో కలిసిన దాన్ని బట్టి అది ఎంత పర్సంటేజ్ చూపిస్తోంది అనేది ఎవరికి అర్థం కానీ పరిస్థితి…
కాబట్టి మందు ఏ కొంచెం తాగినా కూడా బండి పట్టకపోతేనే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో కొంచెం తాగాల్సి వస్తే ఎవరింట్లోకి వాళ్ళు మందు తెచ్చుకుని తాగి అక్కడే పడుకుంటే బెటర్ ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అలా కాకుండా తాగేసి బండి డ్రైవ్ చేసి పోలీసులకు దొరికితే మాత్రం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా ఆక్సిడెంట్ జరిగిన కూడా వాళ్ల ఫ్యామిలీ కోలుకోలేని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.
కాబట్టి ఈ రెండు రోజులపాటు ఎవరు తాగకుండా ఉంటే చాలా మంచిదని పోలీసులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక కొంతమంది పార్టీ మూడులో కొంచెం తాగినా కూడా అక్కడే పడుకొని తగినది దిగిన తర్వాత ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతే ఇంకా మంచిది అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళ మీద జడ్జ్ సైతం ఫైన్ వేస్తూనే వారం రోజులపాటు జైల్లో ఉంచాలనే ఒక నియమాన్ని పెట్టినట్టుగా తెలుస్తోంది… ఇక మందుబాబులు ఇప్పటికైనా మాని ఎవరి పని వాళ్లు చేసుకుంటే వాళ్ల లైఫ్ కూడా బాగుంటుంది…మొత్తానికైతే మందుబాబుల మీద తెలంగాణ గవర్నమెంట్ కూడా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం వల్లే కొంతవరకు యాక్సిడెంట్ల ను సైతం అరికట్టగలిగింది…