https://oktelugu.com/

Hyderabad : ఆయుర్వేదిక్ పేరుతో నకిలీ మందులు.. హైదరాబాద్ లో భారీగా పట్టివేత..

నకిలీ మందుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్రగ్స్ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కొన్ని ఏరియాల్లోని మెడికల్ షాపుల్లో మందులను పరిశీలించిన అధికారులు.. విస్తుపోయారు.. అక్కడున్న మందులు..

Written By:
  • Mahi
  • , Updated On : December 30, 2024 / 01:43 PM IST

    Fake Ayurvedic medicines in Hyderabad

    Follow us on

    Hyderabad : నకిలీ డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. లెక్కకు మించి నకిలీ మందులను మార్కెట్ లలో రిలీజ్ చేసి ప్రజలకు, రోగులకు చుక్కలు చూపిస్తోంది. అధికారులు దాడులు చేస్తున్నా.. షాపులు సీజ్ చేస్తున్నా కూడా వారి తీరులో మార్పు కనిపించడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా రోగాలకు లెక్కుకు మించి నకిలీ మందులను మార్కెట్లలోకి పంపించి చెలామని చేస్తున్నారు. గుర్తించిన ఎవరైనా అడిగితే ఆయుర్వేదం అంటూ చెప్తున్నారు. ఈ రాకెట్ ఇప్పుడు హైదరాబాద్ ను పట్టి పీడిస్తోంది. హైదరాబాద్ లోని నాలుగు, ఐదు పెద్ద పెద్ద ఏరియాల్లో భారీగా మందులు పట్టుబడ్డాయి. అందులో ఉన్న మందులను చూసి డ్రగ్స్ అధికారులు బిత్తరపోయారు. దాదాపు కరోనా తర్వాత నుంచి మెడికల్ షాపులకు గిరాకీలు పెరిగిపోయాయి. ఎంతలా అంటే ఏ జబ్బు అయినా.. అది చిన్నదా…? పెద్దదా…? అనేది పక్కన పెడితే మెడికల్ షాపులో మందులు అమ్ముతున్నారు. మెడికల్ షాపుల ఓనర్లే డాక్టర్లుగా మారుతున్నారన్నమాట. దీంతో షాపునకు వెళ్లిన వారు రోగం చెప్తే వారి వద్ద ఉన్నవి ఇచ్చేస్తున్నారు.

    ప్రతీ వ్యాధికి అది చిన్నదైనా.. పెద్దదైనా.. వైద్యుడికి చూపించుకోవాలి. మరీ జలుబు లాంటిదాన్ని కొంచెం పక్కన పెట్టచ్చు… అది కూడా రెండు మూడు రోజులకు మించి ఉన్నా.. ఎక్కువ ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిందే. కరోనా తర్వాత రోగులు చాలా ఎడ్యుకేట్ అయ్యారు. ఎంతలా అంటే ఏ రోగం వచ్చినా మెడికల్ షాపునకు వెళ్లి మందులు కొనేంతగా.. లేదంటే మెడికల్ షాపు ఓనర్లే మందులు అందించే డాక్టర్లుగా మారారు.

    ఇటీవల హైదరాబాద్ లోని బాలాపూర్, మేడిపల్లి, ఎర్రగడ్డ, జిల్లెలగూడ, చైతన్యపురి లాంటి డివిజన్లలోని మెడికల్ షాపులపై డ్రగ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడున్న నకిలీ మందులను చూసి ఆశ్చర్యపోయారు. నకిలీ కంటి మందులతో సహా జ్వరం, జలుబు, తదితర వ్యాధులకు సంబంధించి డ్రగ్స్ ఉన్నాయి. వాటి గురించి ఆరా తీస్తే అవి ఆయుర్వేదం అంటూ చెప్పుకచ్చారు. కానీ ఆయుర్వేదంలో సైతం ఆ మందులు లేకపోవడంతో డ్రగ్ ఇన్ స్పెక్టర్లు ఖంగుతిన్నారు.

    ఇలా మెడికల్ షాపుల్లో ఇచ్చిన ఈ మందులు వాడితే కంటిలో ఇబ్బందులు తగ్గడం పక్కన పెడితే కండ్లు పోయే ప్రమాదం ఉందని డ్రగ్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక జ్వరం వస్తే తప్పనిసరిగా వైద్యుడినే సంప్రదించాలని అది ఏ జ్వరమో తేలితేనే వైద్యుడి సలహాతో మంచి మందులు వాడి జ్వరాన్ని తగ్గించకోవచ్చని ఇలాంటి మందులు వాడితే తగ్గకపోగా.. తీవ్రమై ప్రణాపాయానికి దాని తీసే అవకాశం లేకపోలేదని వారు హెచ్చరించారు. షాపుల యజమానులపై కేసులు నమోదు చేశారు.