Mohan Babu: నటుడిగా సుదీర్ఘ ప్రస్థానం కలిగిన మోహన్ బాబు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆయన కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. చిన్న కుమారుడు మనోజ్ తండ్రిపై ఆరోపణలు చేశారు. మోహన్ బాబు-మనోజ్ మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. కేసులు పెట్టుకున్నారు. కాగా జుల్పల్లి ఫార్మ్ హౌస్లో టీవీ 9 ప్రతినిధి పై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన గాయపడ్డారు. ఆసుపత్రి పాలయ్యారు. మోహన్ బాబుపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు అయ్యింది. మోహన్ బాబు దాడిపై వివరణ ఇచ్చారు. గాయపడిన వ్యక్తిని నేరుగా కలిసి పరామర్శించాడు.
అయినా పరిస్థితి సద్దుమణగలేదు. మోహన్ బాబు అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. దాంతో మోహన్ బాబును హైదరాబాద్ పోలీసులు విచారణకు పిలిచారు. నోటీసులు జారీ చేశారు. కానీ మోహన్ బాబు విచారణకు హాజరు కాలేదు. ఆయన సమయం కావాలని కోరారు. పోలీసులు మాత్రమే మోహన్ బాబు కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
తాజాగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీలో మోహన్ బాబు ఉన్నాడన్న సమాచారం తో పోలీసులు అక్కడకు వెళ్లారు. కానీ మోహన్ బాబు కనిపించలేదు. తెలంగాణలో కూడా ఆయన లేడు. మొబైల్ కి కూడా అందుబాటులో లేడు. దాంతో మోహన్ బాబు పారిపోయాడనే ప్రచారం జరుగుతుంది. మోహన్ బాబు చాటుగా అమెరికా వెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరి ఈ కథనాలపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. మోహన్ బాబు, విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీ చేస్తున్నారు. ఇది నిర్మాణ దశలో ఉంది. 2025 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. కన్నప్ప చిత్రానికి మోహన్ బాబు నిర్మాత. అలాగే ఓ కీలక రోల్ చేశారు. కన్నప్ప చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు గెస్ట్, ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డివోషనల్ డ్రామాగా తెరకెక్కుతుంది.