Domestic Violence:దారుణాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఘోరాలకు అడ్డు అదుపు ఉండడం లేదు.. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మొత్తానికి భార్యల చేతిలో భర్తలు హతమవుతున్నారు. మేఘాలయ నుంచి మొదలుపెడితే తమిళనాడు వరకు.. ఏదో ఒకచోట దారుణం చోటు చేసుకోవడం.. ఆ దారుణంలో భర్తలు హతం కావడం ఇటీవల పరిపాటిగా మారింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది..
Also Read: వార్నీ నీది కాపీ “ముచ్చటే”నా.. కూసింత సిగ్గుపడు వెటరన్ జర్నలిస్టు..
తెలంగాణ రాష్ట్రంలోని మల్కాపూర్ అనే గ్రామంలో రెడ్డిపల్లి వెంకటేష్ తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు.. ఈ గ్రామం హైదరాబాద్ కు దగ్గరలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో ఉంటుంది . మొదట్లో వెంకటేష్ దంపతుల సంసారం బాగానే ఉండేది. ఇటీవల కాలంలో అతడి భార్య వేరే వ్యక్తితో ఏకాంతంగా మాట్లాడుతుండగా చూశాడు. భార్యను మందలించాడు. నాటి నుంచి వెంకటేష్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవి ఏకంగా పెద్ద మనుషుల దాకా వెళ్లాయి. వారు సర్ది చెప్పడంతో ఇద్దరు యధావిధిగా ఉండడం మొదలుపెట్టారు. కానీ ఇంతలో ఏం జరిగిందో తెలియదు. మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటేష్ పై సోమవారం అతని భార్య దాడి చేసింది. ఈ దాడిలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే వెంకటేష్ పై దాడి చేస్తున్నప్పుడు.. అతడి భార్యకు ఆమె తండ్రి కూడా సహకరించాడని తెలుస్తోంది. వెంకటేష్ చనిపోయిన విషయాన్ని గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకురావడంతో.. వారు సంఘటన స్థలానికి వచ్చారు. వెంకటేష్ ను ఆసుపత్రికి తరలించారు. కాకపోతే అతడు అప్పటికే కన్నుమూశాడు. మృతదేహాన్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ ఘటన మల్కాపూర్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.. ఇటీవల కాలంలో భర్తల ఉదంతాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. మల్కాపూర్ ప్రాంతంలో జరిగిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.. ఇటీవల నాగర్ కర్నూల్, ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలలో జరిగిన దారుణాలు మర్చిపోకముందే.. మల్కాపూర్ లో ఈ సంఘటన చోటు చేసుకోవడం విశేషం. వెంకటేష్ కేసులో అతని భార్య, తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే వెంకటేష్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. వెంకటేష్ భార్యను, ఆమె తండ్రిని తమకు అప్పగించాలని పోలీసులతో వారు వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. అయితే నిందితులపై తాము చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నామని.. ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని.. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: హాట్ టాపిక్ : మల్లారెడ్డి కోడలు బండి సంజయ్ తో భేటీ
వెంకటేష్ భార్య మాట్లాడిన వ్యక్తి ఎవరు? అతడితో ఆమెకు ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు వెంకటేష్ ఆమెతో గొడవపడ్డాడు? ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎందుకు వివాదం చోటుచేసుకుంది? తదుపరి పరిణామాలు ఏవైపుగా దారితీసాయి? అనే కోణాలలో కేసు దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇంకా కొన్ని నిజాలను బయట పెట్టవలసి ఉందని పోలీసులు వివరిస్తున్నారు.