https://oktelugu.com/

రఘునందన్ పై కేసీఆర్ బ్రహ్మస్త్రం పనిచేయలేదా..?

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు తీవ్రంగా శ్రమించి గెలుపొందడంతో శ్రమకు తగ్గ ఫలితం అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 2014, 208లో పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావు ఆ సమయంలో మూడోస్థానానికే పరిమితమయ్యారు. ఇప్పడు కూడా అదేస్థాయిలో ఉంటారని టీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ పరిస్థితి తారు మారైంది. రఘునందన్ రావు ప్రచారం తీవ్రం చేయడంతో  బీజేపీకి బలం పెరిగిపోయింది. ఇది […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 11:49 am
    Follow us on

    Raghunandhan Rao

    దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు తీవ్రంగా శ్రమించి గెలుపొందడంతో శ్రమకు తగ్గ ఫలితం అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 2014, 208లో పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావు ఆ సమయంలో మూడోస్థానానికే పరిమితమయ్యారు. ఇప్పడు కూడా అదేస్థాయిలో ఉంటారని టీఆర్ఎస్ నాయకులు భావించారు. కానీ పరిస్థితి తారు మారైంది. రఘునందన్ రావు ప్రచారం తీవ్రం చేయడంతో  బీజేపీకి బలం పెరిగిపోయింది. ఇది గమనించిన కేసీఆర్ రంగంలోకి  దిగారు. ఆయనపై బ్రహ్మస్త్రం ప్రయోగించారు. అయితే అది పనిచేయలేదు.

    Also Read: ‘దుబ్బాక’ఫలితంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు..

    గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంతర్ రెడ్డి కేసీఆర్ కు కొరకరాని కొయ్యగా మారాడు. తన మాటల తూటాలతో కేసీఆర్ పై విమర్శలు చేయడంతో ఆయన ఓడిపోవడానికి పెద్ద పన్నాగమే పన్నారు. ప్రచారంలో డబ్బులు పంచుతున్నారనే  నెపంతో ఆయనపై కేసులు పెట్టించి జైలుకు పంపించారు. మాటిమాటికి రేవంత్ రెడ్డి ఇళ్లల్లో  తనిఖీలు చేయిస్తూ ప్రచారం చేసుకోనీయకుండా చేశారు. దీంతో రేవంతర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోవడంతో ఆ స్థానం టీఆర్ఎస్ కుదక్కింది.

    ఇప్పడు దుబ్బాకపై అదే పన్నాగాన్ని కేసీఆర్ ప్రయోగించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు సంబంధించిన డబ్బు బంధువుల ఇళ్లల్లో ఉందంటూ పోలీసుల చేత తనిఖీలు చేయించారు. ఆయన బంధువులకు సంబంధించిన అందరి ఇళ్లల్లో సోదాలు చేయించారు. దీంతో రఘునందన్ రావు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. మొత్తంగా రఘునందన్ రావు డబ్బులతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులతో ప్రచారం చేయించారు.

    Also Read: కేసీఆర్ కు మెగాబ్రదర్స్ షాక్..!

    అయితే రఘునందర్ రావుకు అదే సింపతిగా మారింది. ఆయన బంధువుల ఇంట్లో రూ.18 లక్షలు లభ్యమయ్యే విషయం తెలియగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులంతా ఇక్కడ వాలారు. రఘునందన్ కు అండగా ఉన్నారు. ఈ వ్యవహారం న్యూస్ ఛానెళ్లలో, సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో అదే ఆయనకు ప్రచారాస్త్రంగా మారింది. దీంతో బీజేపీ అభ్యర్థికి కలిసి వచ్చింది. కేసీఆర్ ప్లాన్ ఫెయిలయింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఇక్కడ ఓ విషయాన్ని పరిశీలిస్తే..  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహించినప్పడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క సీనియర్ నాయకుడు ఆయనకు అండగా నిలవలేదు. కానీ దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావుకు చిన్నా చితకా నాయకులు సైతం మద్దతుగా ఉన్నారు. ఆ కలిసికట్టుతనమే దుబ్బాకలో విజయానికి కారణమైందని చర్చించుకుంటున్నారు.