
పంజాబీ ముద్దుగమ్మ ఛార్మీకౌర్ సినీరంగ ప్రవేశం 14ఏళ్ల వయస్సులోనే జరిగింది. ‘నీ తోడుకావాలి’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి సౌత్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఛార్మీ ప్రస్తుతం హీరోయిన్ పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టి నిర్మాతగా మారింది.
Also Read: ‘ఖిలాడీ’లో అనసూయ.. రెచ్చిపోనుందా?
దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మీ సినిమాలను నిర్మిస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఛార్మీ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ మూవీకి ఛార్మీ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే ఛార్మీ తొమ్మిది నెలల కొడుకుతో ప్రభాస్ దిగిన ఫొటోను ఛార్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదికాస్తా ప్రస్తుతం వైరల్ గా మారింది.
Also Read: రవితేజ ప్లాన్ మారింది.. ‘క్రాక్’ తరువాత.. !
ఛార్మీకి ఇంకా పెళ్లి కాలేదుగా.. మరీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడని చాలామంది జట్టు పిక్కుంటున్నారు. నిజంగానే ఛార్మీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఛార్మీ తల్లిదండ్రులు కొద్దిరోజుల నుంచి ఆమెకోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వరుడు దొరకగానే పెళ్లి చేసుకుంటానని ఛార్మీ కూడా ప్రకటించింది. ఇలాంటి డౌట్స్ వస్తాయనే ఛార్మీ తన కొడుకు ఫొటో షేర్ చేస్తూనే ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
హీరోయిన్ ఛార్మీ తన పెంపుడు కుక్కను కొడుకులా చూసుకుంటోంది. తనకు చెందిన అలస్కన్ మాలామ్యూట్ జాతి డాగ్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సోఫాలో కూర్చుని ఉన్నారు. తన డాగ్(బేబీ బాయ్)తో ప్రభాస్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోను ఛార్మీ షేర్ చేసింది. ఈ ఫొటోను ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబరపబుతూ షేర్ చేస్తుండటంతో వైరల్ గా మారింది.
#Darling with my 9 months old baby boy ♥️
.
.
.#prabhas #alaskanmalamute @puriconnects pic.twitter.com/4Fr10ViBab— Charmme Kaur (@Charmmeofficial) November 10, 2020
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Comments are closed.