‘దుబ్బాక’ఫలితంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు..

సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఏడేళ్లుగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా ఎదురుదెబ్బ తగలలేదు. కానీ దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా దెబ్బ గట్టిగానే తగిలినట్లు తెలుస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే ఇంత చర్చ ఉండేది కాదేమో.. అయితే బీజేపీ కాకున్నా ఏ పార్టీ గెలిచినా సర్వత్రా చర్చ జరిగేది. కానీ బీజేపీ తీవ్రంగా పోరాటం చేసి గెలవడంతో తెలుగు రాష్ట్రాల్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ […]

Written By: NARESH, Updated On : November 11, 2020 11:44 am
Follow us on

సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఏడేళ్లుగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా ఎదురుదెబ్బ తగలలేదు. కానీ దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా దెబ్బ గట్టిగానే తగిలినట్లు తెలుస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే ఇంత చర్చ ఉండేది కాదేమో.. అయితే బీజేపీ కాకున్నా ఏ పార్టీ గెలిచినా సర్వత్రా చర్చ జరిగేది. కానీ బీజేపీ తీవ్రంగా పోరాటం చేసి గెలవడంతో తెలుగు రాష్ట్రాల్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: రఘునందన్ పై కేసీఆర్ బ్రహ్మస్త్రం పనిచేయలేదా..?

దుబ్బాకలో బీజేపీ గెలుపుతో టీఆర్ఎస్ దొరల పాలనకు చరమగీతం పాడినట్లయిందని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు అధికార పార్టీ ప్రలోభాలకు గురికాకుండా పాలకులపై తీవ్ర వ్యతిరేకత చూపడం హర్షణీయమన్నారు. ఎన్నో రోజులుగా ప్రజలను రకరకాలుగా హింసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని తెలిపింది. సంక్షేమ పథకాలు అని చెప్పి ప్రజలను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అహంకార ధోరణికి దుబ్బాక తీర్పు చెంపపెట్టని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: ‘దుబ్బాక’పై కోట్లలో బెట్టింగ్ లు.. టీఆర్ఎస్ ను నమ్మకున్నవారు తీవ్రంగా లాస్..!

దుబ్బాక ఉప ఎన్నికను మొదటి నుంచి లెక్క చేయకుండా ఉన్నందుకే అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా రావని కేసీఆర్ ప్రసంగించారన్నారు. కానీ ఒక్క ఓటుతోనైనా గెలవాలని టీఆర్ఎస్ కష్టపడాల్సి వచ్చిందన్నారు. లక్ష మెజారిటీ ఖాయమని చెప్పుకొస్తున్న టీఆర్ఎస్ నాయకులకు కనీసం గెలుపు కూడా సాధ్యం కాలేదని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఇదిలా ఉండగా కొన్ని రోజుల నుంచి విజయశాంతి వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇటీవల బీజేపీ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతితో భేటీ అయ్యారు. దీంతో ఆమె మళ్లీ బీజేపీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం తనకు కాంగ్రెస్ లో ప్రాధాన్యం లేదని, త్వరలో బీజేపీలోకి చేరుతారని అంటున్నారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం విజయశాంతిని ఇటీవల పొగడ్తలతో ముంచెత్తారు. అయితే దుబ్బాక ఫలితం చూశాక  విజయశాంతి బీజేపీలో చేరికపై  నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావించారు. మరి విజయశాంతి ఇప్పడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.