https://oktelugu.com/

హేమంత్ హత్య కోసం రెండు సుపారీ గ్యాంగ్ లతో డీల్?

హేమంత్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. 25వ తేదీన సంగారెడ్డి సమీపంలో రోడ్డుపక్కన హేమంత్ మృతదేహం లభ్యమవడంతో ఈ పరువు హత్య కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.. Also Read: దుబ్బాకలో పార్టీల దూకుడు.. బరిలో వీరే? 24న గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న అతడి ఇంటికి అవంతి ఫ్యామిలీ వెళ్లారు. హేమంత్-ఆవంతిలను మాట్లాడుకుందాం రమ్మని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. కానీ మార్గ మధ్యలోనే కారును ఓఆర్ఆర్ వైపు తిప్పడంతో ఇద్దరూ కిందకు దూకే […]

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 / 01:27 PM IST

    hemanth

    Follow us on


    హేమంత్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. 25వ తేదీన సంగారెడ్డి సమీపంలో రోడ్డుపక్కన హేమంత్ మృతదేహం లభ్యమవడంతో ఈ పరువు హత్య కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే..

    Also Read: దుబ్బాకలో పార్టీల దూకుడు.. బరిలో వీరే?

    24న గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న అతడి ఇంటికి అవంతి ఫ్యామిలీ వెళ్లారు. హేమంత్-ఆవంతిలను మాట్లాడుకుందాం రమ్మని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. కానీ మార్గ మధ్యలోనే కారును ఓఆర్ఆర్ వైపు తిప్పడంతో ఇద్దరూ కిందకు దూకే ప్రయత్నం చేశారు. అవంతి తప్పించుకోగా.. హేమంత్ ను కిరాయి మనుషులు కొట్టుకుంటూ తీసుకెళ్లి కారు ఎక్కించుకొని మెడకు తాడు బిగించి హత్య చేశారు.

    అవంతి కులాంతర వివాహం చేసుకోవడంతో రగిలిపోయిన ఆమె తల్లి, తండ్రి, లక్ష్మారెడ్డిలే ఈ హత్య చేయించినట్లు తేలింది. లక్ష్మారెడ్డి బావమరిది, అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి ఈ మొత్తం హత్య ప్లాన్ ను అమలు చేశాడు. ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    ‘హేమంత్’ పరువు హత్యలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్-అవంతిలను విడదీయాలనే ఉద్దేశంతో ఆమె మేనమామ భారీ కుట్రలకు పాల్పడ్డట్టు తెలిసింది. హేమంత్-అవంతి పెళ్లైన నెల రోజులకే  ఓ సుపారీ గ్యాంగ్ తో అవంతి మేనమామ డీల్ కుదుర్చుకున్నట్టు వెల్లడైంది. .. హేమంత్ ను కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా అవంతిని విడదీసేందుకు ఆ సుపారీ గ్యాంగ్ తో యుగంధర్ రెడ్డి రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. పలుసార్లు రెక్కీ కూడా నిర్వహించినట్టు తెలిసింది. అయితే ఆ గ్యాంగ్ ఏవేవో కారణాలతో హేమంత్ కిడ్నాప్ ను వాయిదా వేస్తూ వచ్చింది.

    Also Read: తెలంగాణ మళ్లీ టాప్.. గొప్ప విజయం

    ఓ సుపారీ గ్యాంగ్ హ్యాండ్ ఇవ్వడంతో ఇక లాభం లేదనుకొని  అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి  మరో దారుణమైన సుపారీ గ్యాంగ్ అయిన‘బిచ్చూ యాదవ్ గ్యాంగ్’ను సంప్రదించాడు. వాళ్లతో ఏకంగా హేమంత్ కిడ్నాప్, హత్యకు ప్లాన్ చేశాడు. 24న గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న అతడి ఇంటికి అవంతి ఫ్యామిలీ వెళ్లారు. హేమంత్-ఆవంతిలను మాట్లాడుకుందాం రమ్మని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. కానీ మార్గ మధ్యలోనే కారును ఓఆర్ఆర్ వైపు తిప్పడంతో ఇద్దరూ కిందకు దూకే ప్రయత్నం చేశారు. అవంతి తప్పించుకోగా.. హేమంత్ ను కిరాయి మనుషులు కొట్టుకుంటూ తీసుకెళ్లి కారు ఎక్కించుకొని మెడకు తాడు బిగించి హత్య చేశారు. సంగారెడ్డి సమీపంలో పడేశారు. హేమంత్ హత్యకోసం ఏకంగా రెండు సుపారీ గ్యాంగ్ లను కలిసిన విషయం తాజాగా వెలుగుచూసింది.