Also Read: అనుష్క పెళ్లిపై క్లారిటీ వచ్చేసినట్టేనా?
భారత చలన చిత్రపరిశ్రమలో హిందీ చిత్రపరిశ్రమ నెంబర్ వన్ ప్లేసులో కొనసాగుతోంది. దీంతో అన్ని ఇండస్ట్రీలకు చెందిన దర్శకులు బాలీవుడ్లో సత్తాచాటేందుకు తాపత్రయం పడుతుంటారు. ఇదేమీ కొత్త విషయం కాకపోయినా ఇప్పుడున్న దర్శకులు చాలామంది బాలీవుడ్ బాటపడుతూ సొంత మార్కెట్ కు దూరమవుతున్నారు. కొందరు బాలీవుడ్లో సక్సస్ సాధిస్తుండగా మరికొందరు అపజయాలు చవిచూపిస్తున్నారు. ఆ తర్వాత కూడా పలువురు దర్శకులు హిందీలో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు.
అయితే తాజాగా మరికొందరు టాలీవుడ్ దర్శకులు ఇదే లిస్టులో చేరుతుండటం గమనార్హం. ‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్లో బాక్సాఫీస్ రికార్డును దర్శకుడు సందీప్ వంగా తిరగరాశాడు. ఆ తర్వాత తెలుగులో కాకుండా బాలీవుడ్లో సినిమా తీసి సక్సస్ అందుకున్నాడు. అయితే టాలీవుడ్లో ఇప్పటివరకు ఒక సినిమా కూడా కమిట్ కాకపోవడంతో అతడు టాలీవుడ్ కు దూరమైనట్లే కన్పిస్తోందని అభిమానులు చెప్పుకుంటున్నారు.
Also Read: టాలీవుడ్ పై ఉమ్మేస్తున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు?
‘ప్రస్థానం’ మూవీని హిందీలోకి తీసుకెళ్లిన దేవా కట్టా అక్కడ ఎదురుదెబ్బ తగలింది. ‘ఘాజీ’తో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న సంకల్ప్ రెడ్డి కూడా బాలీవుడ్ బాటపట్టాడు. ‘జెర్సీ’తో ఘనవిజయం అందుకున్న గౌతమ్ కూడా హిందీ సినిమాల వైపే మొగ్గుచూపాడు. టాలీవుడ్లో క్రేజీ సంపాదించుకున్న డైరెక్టర్లు బాలీవుడ్ బాటపట్టి సొంత మార్కెట్ ను కొల్పోతున్నారు. వీరంతా అటూ బాలీవుడ్లో సక్సస్ సాధించలేక.. ఇటూ టాలీవుడ్లోనూ క్రేజ్ ఉపయోగించుకోలేక చతికిలపడుతుండటం గమనార్హం.