తెలంగాణలో వ్యాక్సిన్ బంద్ నిర్ణయం.. దుమారం

కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయం మనకు తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసిన వైరస్ దారుణాలను ప్రజలు ఎప్పటికి మరిచిపోరు. వయసు బేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను అతలాకుతలం చేసిన కరోనా రక్కసి నిరోధానికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ ప్రక్రియ. దీని వేగవంతం అంతగా ఉండడం లేదు. దీంతో అధిక జనాభా ఉన్న దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిస్తుండడంతో అందరికి వ్యాక్సిన్ అందడం కష్టంగా నే మారింది. రోజు వ్యాక్సిన్ వేస్తేనే లక్ష్యం […]

Written By: Srinivas, Updated On : July 7, 2021 11:33 am
Follow us on

కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయం మనకు తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసిన వైరస్ దారుణాలను ప్రజలు ఎప్పటికి మరిచిపోరు. వయసు బేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను అతలాకుతలం చేసిన కరోనా రక్కసి నిరోధానికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ ప్రక్రియ. దీని వేగవంతం అంతగా ఉండడం లేదు. దీంతో అధిక జనాభా ఉన్న దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిస్తుండడంతో అందరికి వ్యాక్సిన్ అందడం కష్టంగా నే మారింది. రోజు వ్యాక్సిన్ వేస్తేనే లక్ష్యం చేరుకోవడానికి చాలా సమయం పడుతున్న సందర్భంలో వారానికి రెండు రోజులు విరామం ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగాల్సిన సమయంలో వేగాన్ని తగ్గించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఇంకా కోటిన్నరకు పైగా వ్యాక్సినేషన్ వేయాల్సి ఉండగా ప్రభుత్వం అకస్మాత్తుగా బుధ, ఆదివారాలు వ్యాక్సిన్ వేయడం లేదని ప్రకటించడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తక్కు జనాభా ఉన్న దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిపోగా మన దేశంలో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో రెండు రోజులు వ్యాక్సినేషన్ ఆపేయడంతో అందరికి వ్యాక్సిన్ వేయాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రాష్ర్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం రోజుకు 2 లక్షల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ అందుతోంది. ఈ నేపథ్యంలో 18 ఏళ్లు దాటిన వారు రెండు లక్షలకు పైగా ఉన్నారు. ఇందులో 31 శాతం వరకు సింగిల్ డోసు తీసుకున్న వారు ఉన్నారు. 6 శాతం మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది.

మొత్తం 38 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని వారు 62 శాతం మంది ఉన్నారు. అర్బన్ ఏరియాల్లో వేగంగా వ్యాక్సినేషన్ జరిగినా గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా జరుగుతోంది. తాజాగా రెండు రోజులు వ్యాక్సిన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ర్టంలో మరోసారి కేసులు పెరుగుతుండడంపై ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వం నిర్ణయం సముచితంగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా రక్కసిని రూపుమాపే సందర్భంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంచేయాల్సింది పోయి నెమ్మదిగా చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక ఆంతర్యమేమిటనే సందేహాలు వస్తున్నాయి. రాస్ర్టం ఈ మేరకు ప్రకటించడంతో ప్రజల్లో సైతం అసహనం వ్యక్తం అవుతోంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.