Court Jobs Notification In Telangana: తెలంగాణ ప్రభుత్వం చాలా రోజుల తర్వాత మళ్లీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందించిన రేవంత్‌రెడ్డి సర్కార్.. ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
పోస్టుల వివరాలు..
– మొత్తం ఖాళీలు 859
– స్టెనోగ్రాఫర్లు: 150 పోస్టులు (డిగ్రీ/ఇంటర్ + స్టెనో స్కిల్స్)
– జూనియర్ అసిస్టెంట్లు: 250 పోస్టులు (డిగ్రీ)
– టైపిస్టులు: 100 పోస్టులు (ఇంటర్ + టైపింగ్)
– కాపీస్టులు: 120 పోస్టులు (10వ తరగతి)
– ఆఫీస్ సబార్డినేట్: 180 పోస్టులు (7వ తరగతి)
– డ్రైవర్లు, వాచ్‌మెన్, స్వీపర్లు: మిగిలిన 159 పోస్టులు (సంబంధిత అర్హతలు)
అర్హతలు, దరఖాస్తు గడువు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు.. 18–46 సంవత్సరాలు. పోస్టును బట్టి 7వ తరగతి నుంచి డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. శనివారం(జనవరి 24) నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఫిబ్రవరి 13 వరకు ్టటజిఛి.జౌఠి.జీnలో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం, పరీక్షలు, ఫీజు వివరాలు..
రాత పరీక్ష, టైపింగ్/స్టెనో టెస్ట్, వాక్–ఇన్ ఇంటర్వ్యూ. ఫీజు రూ.600 (జనరల్), రూ.400 (రిజర్వడు).. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. తక్కువ విద్యార్హతతో స్థిర ప్రభుత్వ ఉద్యోగాలు, మంచి జీతం, పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. త్వరగా అప్లై చేసి, డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి మరి.