Pawan Kalyan vs Thalapathy Vijay: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధిస్తే ఆ హీరో మార్కెట్ పెరుగుతుంది. తద్వారా వాళ్ళ రెమ్యునరేషన్స్ ను కూడా పెంచేస్తారు. తద్వారా వాళ్ల మీద బడ్జెట్ ఇంకాస్త ఎక్కువగా పెట్టి భారీ లాభాలను రాబట్టాలని ప్రొడ్యూసర్లు సైతం ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తెలుగు సినిమా ఇండస్ట్రిని శాసించే స్థాయికి ఎదిగాడనే విషయం మనకు తెలిసిందే… ప్రస్తుతం ఆయన రాజకీయ రంగంలో పెను సంచలనాలను సృష్టిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. తను జనసేన పార్టీని పెట్టిన 10 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను అందుకున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక అతని ఇన్స్పిరేషన్ తోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విజయ్ సైతం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనకు ఆరంభంలోనే భారీ దెబ్బలైతే తగులుతున్నాయి. రీసెంట్ గా తన భార్య విజయ్ మాతో ఉండటం లేదు, మా గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి ఆయన నుంచి నాకు విడాకులు కావాలి అంటూ కోర్టులో కేసు వేసింది. ఇక దానికి తోడుగా తనకు త్రిషతో ఎఫైర్ ఉందంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక వీటన్నింటినీ తట్టుకొని తను రాజకీయంగా ముందుకు ఎదగగలడా లేదా అనేది చర్చనీయంగా మారింది.
నిజానికి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే ముందే వీటన్నింటికి సంబంధించిన విషయాలను క్లియర్ గా చర్చించుకోవాలి. ఎందుకంటే ఒకసారి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత ఇతర పార్టీల వాళ్లు బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఏ చిన్న లూప్ హోల్ దొరికినా కూడా దాన్ని వదిలిపెట్టకుండా ఒక ఆట ఆడేసుకుంటారు… ప్రస్తుతం విజయ్ పరిస్థితి అలాగే ఉంది. ఆయన తన ఇంట్లో వాళ్ళనే సరిగ్గా చూసుకోలేక పోతున్నాడు.
ఇక జనాన్ని ఎలా చూసుకుంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ విజయ్ కంటే చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచించాడు. అందుకే తనకున్న ప్రాబ్లమ్స్ అన్నింటిని క్లియర్ చేసుకున్న తర్వాతే తన రాజకీయ రంగంలోకి వచ్చాడు. తన విజన్ కూడా కేవలం ప్రజలకు మంచి చేయాలనే తప్ప డబ్బు సంపాదించాలని కాదు.
అలాగే ఇంకా వేరే దురుద్దేశంతో కూడా తనకు లేదని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇక ఆయనను అభిమానించే వాళ్లే అతని నుంచి ఎలాంటి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా ఓట్లు వేశారు అంటే మాములు విషయం కాదు… రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్ కి ఉన్న విజన్ విజయ్ కి లేదు. తను ఒకవేళ గెలిచిన కూడా జనానికి ఏం చేస్తాడు అనే విషయంలో తనకి సరైన క్లారిటీ లేదని పలువురు సినిమా మేధావులు అలాగే రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు…