Dhurandhar 2 advance bookings: దేశం లోని సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ధురంధర్ 2 : ది రివెంజ్'(Dhruandhar 2 : The Revenge). కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. దీనికి ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ షాట్స్ తో నింపేశారు. కాస్త ఎమోషన్ ని కూడా చూపించి ఉండుంటే బాగుండేది అని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. అది కాసేపు పక్కన పెడితే ఈ చిత్రం ఒక రోజు ముందుగా , అంటే మార్చి 18 న సాయంత్రం 5 గంటల నుండే ప్రీమియర్ షోస్ ద్వారా విడుదల కాబోతుంది. ఆ కారణం చేత , అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా నేడే మొదలు పెట్టేసారు. ఈ బుకింగ్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
కేవలం ప్రీమియర్స్ షోస్ గ్రాస్ ఇండియా వైడ్ గా ఈ చిత్రం 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను దాటేసింది అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. హైదరాబాద్ లో అప్పుడే కొన్ని షోస్ హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకున్నాయి. ఊపు చూస్తుంటే ఈ చిత్రం ప్రీమియర్స్ షోస్ ద్వారా కేవలం ఇండియా నుండి 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే ఆల్ టైం ఇండియన్ రికార్డు ని నమోదు చేసినట్టే . ప్రస్తుతం ఈ రికార్డు పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం పేరిట ఉంది. ఈ సినిమాకు కేవలం ప్రీమియర్ షోస్ నుండే 35 కోట్ల రూపాయిల గ్రాస్ ఇండియా వైడ్ గా వచ్చాయి. ఇప్పుడు ఈ రికార్డు డేంజర్ లో పడిందని అంటున్నారు ట్రెడ్ విశ్లేషకులు.
ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ట్రెండ్ మామూలు రేంజ్ లో లేదు. కేవలం నార్త్ అమెరికా లోనే ప్రీమియర్ షోస్ నుండి 4 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయని అంటున్నారు. అందులో గడిచిన 24 గంటల్లో లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఓవర్సీస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది, దానికి తోడు టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల , టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ఈరోజు ట్రైలర్ విడుదల అయ్యింది కాబట్టి, రేపు రెండు లక్షల డాలర్ల గ్రాస్ అదనంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ట్రెండ్ చూస్తుంటే కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.