Ravi Teja: మాస్ మహారాజా గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నా హీరో రవితేజ…ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లను మూటకట్టుకుంటున్న నేపథ్యంలో రీసెంట్గా సంక్రాంతి కానుకగా వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఇక అక్కడి నుంచి ఆయన తీసుకున్న కొత్త రూట్ చాలా బాగా వర్కౌట్ అయిందంటూ అతని అభిమానులు అభిప్రాయపుల్దుతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ డైరెక్షన్లో చేయబోతున్న ‘ఇరుముడి’ సినిమాలో సైతం అతని క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట… సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాతో రవితేజ మరో ఎక్స్పరిమెంట్ చేస్తున్నాడు. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే రవితేజ కొత్త రూట్ 100% వర్క్ అవుట్ అయినట్టే అంటూ అతని అభిమానులు సైతం ఆనందపడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా అతనికి చాలా కీలకమనే చెప్పాలి…
రెగ్యూలర్ ఫార్మాట్లో సినిమాలను చేసుకుంటూ వెళ్తున్న రవితేజకు కొత్త జానర్ ను టచ్ చేయడం అనేది చాలా మంచి విషయం… ఇప్పటికైనా ఆయన ఇలాంటి కొత్త రకం సినిమాలను చేసుకుంటూ వెళ్తే అతని కెరియర్ మరో 10 సంవత్సరాల పాటు సాఫీగా సాగుతుందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
హీరో ఎవరైనా కూడా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను చేసినప్పుడే వాళ్ళ పొటెన్షియాలిటీ ఏంటి అనేది బయటపడుతుంది. అలా కాకుండా ఒకే జానర్ లో సినిమాలను చేసుకుంటూ వెళ్తే రొటీన్ యాక్టింగ్ అనిపించి ప్రేక్షకులకు చిరాకు పుట్టే అవకాశం ఉంది… సేఫ్ జానర్లో వెళ్తే సక్సెస్ లను సాధించవచ్చు కానీ వాళ్ళ ఐడెంటిటిని కోల్పోయే ప్రమాదమైతే ఉంది.
రవితేజ విషయంలో అదే జరుగుతుంది కాబట్టి అతను ఇప్పుడు కొత్త రూట్ తీసుకొని చాలావరకు మంచి పని చేశాడనే చెప్పాలి…ఇక ఇలాంటి కొత్త సినిమాలు చేస్తేనే ఆయన వెనక్కి తిరిగి చూసుకుంటే డిఫరెంట్ పాత్రలు కనిపిస్తాయి… తన నటనలో కూడా వైవిధ్యాన్ని చూపించి ప్రేక్షకులను మెప్పించినవాడిగా తనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది…