Corrupt Departments in Telangana: లంచం.. అవినీతి.. ఇవి దేశాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన జబ్బు. ఇది ఉగ్రవాదం కన్నా భయంకరమైనది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే.. ప్రజలకు సేవ చేయాలని అనుకునేవారు. కానీ నేడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఉద్యోగం వస్తే బాగా లంచాలు తీసుకుని సంపాదించుకోవచ్చు అని భావిస్తున్నారు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఇదే ధోరణితో ఉన్నారు. రాబోయే అవినీతి విసృంకల రూపం దాల్చే ప్రమాదం ఉంది. ఇక ప్రజలు కూడా లంచం ఇస్తేనే ప్రభుత్వ శాఖల్లో పని అవుతుంది అన్న భావన పెరుతోంది.
ఏసీబీకి పట్టుబడుతున్నా..
ప్రభుత్వ శాఖల్లో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. డబ్బులు ఇస్తేనే అధికారులు పని చేస్తున్నారు. కొన్ని శాఖల్లో ఈ లంచం వందల రూపాయల్లో ఉంటే కొన్ని శాఖల్లో వేలు, తర్వాత లక్షలు, కోట్లలో కూడా ఉంది. ఇక ప్రజలు కూడా లంచాలు ఇస్తేనే పని అవుతంది అన్న బావనలో ఉన్నారు. కొందరు ధైర్యంగా ఏసీబీకి పట్టిస్తున్నారు. కఠిన శిక్షలు లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల తీరులో మార్పు రావడం లేదు.
అవినీతి ఎక్కువ జరిగే శాఖలు ఇవే..
ఇక తెలంగాణలో అన్ని శాఖల్లో అవినీతి జరుగుతోంది. ఆ శాఖ ఈ శాఖ అనే తేడా లేకుండా ఎందెందు వెతికినా అవినీతి విస్తరించింది. అయితే కొన్ని శాఖల్లో విపరీతంగా ఉంది. ఎక్కువ అవినీతి జరిగే ఐదు శాఖలు ఇలా ఉన్నాయి.
Also Read: Telangana Financial Situation: ఏ పని చేయాలన్నా అప్పులే.. ఇదీ తెలంగాణ పరిస్థితి!
రెవెన్యూ శాఖ..
భూమి రిజిస్ట్రేషన్, ఆస్తి బదిలీలు, భూ సంబంధిత సమస్యలలో అవినీతి ఆరోపణలు తరచూ వినిపిస్తాయి. భూ రికార్డుల సవరణలు, లైసెన్స్‌లు, క్లియరెన్స్‌లలో లంచాలు ఇవ్వడం లేదా అక్రమ లావాదేవీలు జరగడం వంటి ఫిర్యాదులు ఉంటాయి.
పౌర సరఫరాల శాఖ: రేషన్ కార్డుల పంపిణీ, సబ్సిడీ పథకాలు మరియు ఆహార ధాన్యాల సరఫరా వంటి కార్యకలాపాలలో అవినీతి ఆరోపణలు ఎదురవుతాయి. సబ్సిడీల దుర్వినియోగం లేదా నకిలీ లబ్ధిదారుల సష్టి వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఎక్సైజ్ శాఖ..
మద్యం లైసెన్స్‌లు, చట్టవిరుద్ధమైన మద్యం వ్యాపారం, ఎక్సైజ్ రెవెన్యూ సేకరణలో అవినీతి ఆరోపణలు ఉంటాయి. ఈ శాఖ మద్యం, మాదక ద్రవ్యాలకు సంబంధించిన చట్టాలను అమలు చేస్తుంది, ఇక్కడ లంచాలు లేదా అక్రమ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉంది.
Also Read: Raja Singh Telangana BJP: తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ రాగం..
రవాణా శాఖ..
వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ, రోడ్ టాక్స్ సేకరణలో అవినీతి ఆరోపణలు సాధారణం. అక్రమ రవాణా లేదా నిబంధనలను ఉల్లంఘించడానికి లంచాలు ఇవ్వడం వంటి సంఘటనలు నమోదవుతాయి.
మున్సిపల్ శాఖ: భవన నిర్మాణ అనుమతులు, జోనింగ్ క్లియరెన్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులలో అవినీతి ఆరోపణలు తలెత్తుతాయి. కాంట్రాక్ట్‌లు, టెండర్‌లలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది.