Country With Most Road Accidents: ఒకసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఇంటికి వచ్చే వరకు వారి మీద బెంగనే ఎక్కువ ఉంటుంది. ఈ యాక్సిడెంట్ల వల్ల ఎవరికి ఎప్పుడు ఏం అవుతుందో అర్థం అవడం లేదు. ఇక బైక్, కార్, ఆటో ఇలా దేన్ని తీసుకొని వెళ్లినా సరే బయపడాల్సిందే. ఇంతకీ ప్రపంచంలో ఏ దేశంలో యాక్సిడెంట్లతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి? ఎక్కడ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి? వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటువంటి సంఘటనలను నివారించడానికి సమగ్ర అవగాహన కార్యక్రమాలు అత్యవసరంగా అవసరం అంటున్నారు కొందరు. అయితే భారతదేశంలో కూడా, ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇది ఇప్పుడు దేశంలోని ప్రధాన సమస్యలలో ఒకటిగా మారింది. అటువంటి పరిస్థితిలో, ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ దేశాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రతి పౌరుడికి రోడ్డు భద్రత చాలా ముఖ్యం. రోడ్లపై ప్రమాదాలను నివారించడానికి, తప్పనిసరిగా పాటించాల్సిన అనేక నియమాలు రూపొందించారు. అవి పాటించడం ప్రతి పౌరుడికి చాలా అవసరం. అయితే ప్రపంచంలోనే 2024లో అమెరికాలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఇక్కడ 1.9 మిలియన్లకు పైగా కారు ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 36,000 మందికి పైగా మరణించారు. లక్షలాది మంది గాయపడ్డారు. అవగాహన ప్రచారాలు ఉన్నప్పటికీ, అమెరికాలో రోడ్డు ప్రమాదాలు తీవ్రమైన సమస్యగా మిగిలిపోయాయి.
ఇతర ప్రధాన దేశాలలో రోడ్డు ప్రమాద గణాంకాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి.
జపాన్: మొత్తం 5,40,000 కారు ప్రమాదాలు జరిగాయని, దాదాపు 4,700 మంది మరణించారని, 6,00,000 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని నివేదిక తేల్చింది.
భారతదేశం: ఇక మన దేశం గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం దాదాపు 4 లక్షల 80 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని అంటున్నాయి నివేదికలు. వీటిలో దాదాపు 1.8 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ సంఖ్య భారతదేశానికి చాలా ఆందోళన కలిగించే విషయం.
జర్మనీ: 2024లో 3,00,000 కంటే ఎక్కువ ప్రమాదాలు. ఫలితంగా దాదాపు 3,000 మంది మరణించారు.
టర్కీ: గత సంవత్సరం 1,75,000 కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 5,473 మంది మరణించారు. 2,83,234 మంది గాయపడ్డారు.
ఇటలీ: 2024లో 1,72,000 కంటే ఎక్కువ కారు ప్రమాదాలు నమోదయ్యాయి. 3,173 మంది మరణించారు. 2,41,000 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు.
యునైటెడ్ కింగ్‌డమ్: మొత్తం 123,000 ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 1,800 మంది మరణించారు. 160,000 మంది గాయపడ్డారు.
Also Read: Road Accident: పిల్లలను వదిలేస్తే ఎంతటి ఘోరమో ఈ వీడియో చూడండి
ఈ రోడ్డు ప్రమాదాలకు అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా సరిగ్గా లేని రోడ్లు, అధిక వేగంతో కారు నడపడం, ట్రాఫిక్ నియమాలను విస్మరించడం, తాగి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి ఎక్కువ కారణం అవుతున్నాయి అంటున్నారు నిపుణులు. ఈ గణాంకాలు రోడ్డు భద్రత అనేది ప్రపంచవ్యాప్త సమస్య అని, ఈ భయంకరమైన ప్రమాదాలు, మరణాలను తగ్గించడానికి ప్రభుత్వాలు, పౌరులు ఇద్దరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అనేది వాస్తవం. మన దేశంలో కూడా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.