https://oktelugu.com/

అసెంబ్లీకి గుర్రపు బండ్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తే సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి గర్రపుబండ్లపై వచ్చారు. భట్టి విక్రమార్క్, శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్రపుబండ్లపై రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాగా, గుర్రపు బండ్లను అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు అనుమతికి నిరాకరించడంతో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 27, 2021 / 01:02 PM IST
    Follow us on

    కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తే సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి గర్రపుబండ్లపై వచ్చారు. భట్టి విక్రమార్క్, శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్రపుబండ్లపై రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

    కాగా, గుర్రపు బండ్లను అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు అనుమతికి నిరాకరించడంతో వారు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నారాయణగూడ పీఎస్ కు తరలించారు. ఈ సంద్భంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రలో ధరలు పెంచి సామాన్యుల నడ్జి విరుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై భారం పడుతోందని అన్నారు.

    బీజేపీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర దిగొచ్చే వరకే పోరాటం చేస్తామని భట్టి విక్రమార్క్ అన్నారు.  భారత్ బంద్ కు మద్దతుగా, కొత్త వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్రపు బండిపై అసెంబ్లీకి రావడం టెన్షన్ ను క్రియేట్ చేసింది. గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ సభ్యులు గుర్రపు బండిపై వచ్చారు. వారిని అసెంబ్లీ బయటే ఆపేశారు పోలీసలు. దీంతో అక్కడే రోడ్డుపై బైటాయించారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీలోకి కార్లలో మాత్రమే రావాలని ఉందా? గుర్రపు బండిపై రాకూడదని అసెంబ్లీ రూల్స్ లో ఉందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.