https://oktelugu.com/

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో లేఖ రాశారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అర్హులకు 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ 5 పేజీల బహిరంగ లేఖ రాశారు. దళితులు సంక్షేమ పట్ల చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అర్హులకు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 27, 2021 / 01:12 PM IST
    Follow us on

    సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో లేఖ రాశారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అర్హులకు 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ 5 పేజీల బహిరంగ లేఖ రాశారు. దళితులు సంక్షేమ పట్ల చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అర్హులకు 10 లక్షల ఆర్ధిక సహాయం అందించాలి  అన్నారు.
    దళితులకు మంత్రి వర్గంలో తగిన ప్రాధాన్యత కెసిఆర్ ఇవ్వడం లేదని ఆరోపించిన బండి సంజయ్ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా దళితులకు తెరాస పార్టీ , ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ప్రతీ ఒక్క హామీ నెరవేర్చాలి  డిమాండ్ చేశారు.

    మాల సామాజికి వర్గంకు మంత్రి వర్గంలో స్థానం ఇస్తే మాదిగ సామజిక వర్గం కు ఇవ్వకుండా దళితులను కెసిఆర్ మోసగిస్తున్నారు – బండి సంజయ్  మాదిగ , మాల సామాజిక వర్గాల ఆత్మ గౌరవ భవనాలకు భూమి ఎప్పుడు కేటాయిస్తారు అన్ని ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు, అంబేద్కర్ టవర్స్ కు అయిదు సంవత్సరాలు క్రితం శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని అన్నారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఏడు సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఫార్మ్ హౌస్ , ప్రగతి భవన్ దాటి బయటకు వచ్చి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు దండ వేయ్యలేదు.  దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను అన్ని దళితులను కెసిఆర్ నిట్టనిలువునా మోసగించారని అన్నారు.  దళితులకు , గిరిజనులకు మూడు ఎకరాలు భూమి ఇవ్వలిసిందే అన్నారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మల్లించి దళితులకు కెసిఆర్ ద్రోహం చేస్తున్నారు.

    ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను స్వతంత్ర నోడెల్ ఏజెన్సీ ద్వారా ఖర్చు చెయ్యాలని డీమాండ్ చేశారు. యస్సీ కార్పొరేషన్ రుణాలు కోసం లక్షల మంది దళిత యువతీ , యువకులు ఎదురుచూస్తున్నారు , వారికీ వెంటనే రుణ సదుపాయం కలిపించాలని కోరారు. ఎస్సీ , ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని కోరారు.