HomeతెలంగాణCongress and BJP : సన్న బియ్యం పథకంపై క్రెడిట్‌ యుద్ధం: కాంగ్రెస్‌–బీజేపీ మధ్య రాజకీయ...

Congress and BJP : సన్న బియ్యం పథకంపై క్రెడిట్‌ యుద్ధం: కాంగ్రెస్‌–బీజేపీ మధ్య రాజకీయ రగడ

Congress and BJP : తెలంగాణలో పేదల కడుపు నింపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం(congress Government) ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకంపై రాజకీయ వివాదం రేగింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా హుజూర్‌నగర్‌(Huzurnagar)లో ప్రారంభించారు. ‘పేదలు కూడా శ్రీమంతుల్లా సన్న బియ్యం తినాలనే ఆలోచనతో ఈ పథకం తెచ్చామని‘ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే రేషన్‌ షాపుల విధానం, బియ్యం సరఫరా పథకాలు మొదలయ్యాయని, గతంలో సీఎం కోట్ల విజయ్‌ భాస్కర్‌ రెడ్డి(Kotla Vijaya bhaskar Reddy) రూ.90 పైసలకే కిలో బియ్యం ఇచ్చారని రేవంత్‌ గుర్తు చేశారు. ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని, భవిష్యత్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా దీన్ని కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సోనియా గాంధీ(Sonia Gandhi) ఆహార భద్రతా చట్టం కోసం చేసిన కషిని కూడా ఆయన కొనియాడారు.

Also Read : కాంగ్రెస్ , బీజేపీ పాలనకు మధ్య తేడా ఏంటి? జనం ఏమనుకుంటున్నారు?

క్రెడిట్‌ కోసం..
అయితే, ఈ పథకం క్రెడిట్‌ను కాంగ్రెస్‌ తీసుకోవాలని చూస్తుండగా, బీజేపీ(BJ) దీనికి కౌంటర్‌ ఇచ్చింది. కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay), ‘సన్న బియ్యం పథకంలో ఎక్కువ ఖర్చు కేంద్రమే భరిస్తోంది. కిలోకు రూ.40 కేంద్రం ఇస్తుండగా, రాష్ట్ర భారం కేవలం రూ.10 మాత్రమే‘ అని పేర్కొన్నారు. రేషన్‌ షాపుల్లో ప్రధాని మోదీ(PM Modi)ఫోటో కూడా పెట్టడం లేదని, పేదల కోసం కేంద్రం చేస్తున్న ఖర్చును ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఈ వాదనతో బీజేపీ పథకంలో తమ వాటా ఎక్కువగా ఉందని నొక్కి చెబుతోంది. కాంగ్రెస్‌ మాత్రం, బియ్యం పంపిణీ నుంచి సన్న బియ్యం వరకు అన్ని పథకాలు తమ హయాంలోనే మొదలయ్యాయని, పేదల ఆకలి తీర్చడం తమ లక్ష్యమని చెబుతోంది. దీంతో ఈ అంశంపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

రేపటి నుంచి పంపిణీ..
ఇదిలా ఉండగా, మంగళవారం నుంచి రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్న వడ్లను సీఎంఆర్‌ కింద మిల్లులకు ఇచ్చిన ప్రభుత్వం, అందులో సగం బియ్యాన్ని జిల్లా గోదాములకు తరలించింది. ఏప్రిల్‌ కోటా కోసం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ షాపులకు సరఫరా ఇప్పటికే మొదలైంది.

Also Read : తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ కొట్టుకుచస్తున్నాయి.. ఎందుకు!? 

Exit mobile version