spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Trailer Review: 'ఉస్తాద్ భగత్ సింగ్ ' ట్రైలర్ రివ్యూ :...

Ustaad Bhagat Singh Trailer Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!

Ustaad Bhagat Singh Trailer Review: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా , మేకర్స్ కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ పై పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి వచ్చిన ఏ కంటెంట్ కూడా భారీగా వర్కౌట్ అవ్వలేదు. చాలా యావరేజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మొన్న విడుదలైన పాటకు పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కానీ సినిమా పై హైప్ పెంచేందుకు ఆ పాట ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో ఈ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడలేదు. ఫలితంగా ఓవర్సీస్ లో చాలా డల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి.

Also Read: 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ‘పాతాళ భైరవి’ మూవీని ఫస్ట్ ఆ హీరోతో చేయాలనుకున్నారా ..?

అయితే నేడు విడుదలైన ట్రైలర్ ఈ సినిమా పై బజ్ పెంచుతుందా లేదా ?, అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది ?, దాని విశేషాలేంటి అనేది ఈ రివ్యూ లో చూద్దాం. ఈ ట్రైలర్ లోని అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే , అది పవన్ కళ్యాణ్ మాత్రమే. చాలా కాలం తర్వాత ఆయన చాలా ఎనెర్జిటిక్ గా కనిపించాడు. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు ఒక్కటి కూడా చేయలేదు. అన్నీ సీరియస్ తరహా పాత్రలే. పవన్ కళ్యాణ్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం ఆయనలోని ఎనర్జిటిక్ యాక్టింగ్. అది ఈమధ్య కాలంలో కనిపించలేదు, చాలా కాలం తర్వాత మరోసారి తమ అభిమాన హీరో ని ఆ యాంగిల్ లో చూసేసరికి అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 7 సెకండ్స్ ఉంది.

అందులో ఒక నిమిషం పాటు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని చూపించగా, మరో నిమిషం యాక్షన్ పార్ట్ ని చూపించారు. మొత్తం మీద యాక్షన్ + కామెడీ + సెంటిమెంట్ కలిపి తీసిన ఒక ఫక్తు కమర్షియల్ సినిమాగా అనిపించింది. ఎలాంటి ట్రైలర్ కట్ కోసం అయితే అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారో, అలాంటి ట్రైలర్ వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్ కారణంగా సినిమా పై ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుంది అనేది చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు పాటలు దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ థమన్ అందించాడు. ట్రైలర్ కి కూడా థమన్ యే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ బాగానే ఉంది కానీ, అక్కడక్కడా మిక్సింగ్ సరిగా లేదని కొంతమంది అంటున్నారు. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ థియేట్రికల్ ట్రైలర్ ని మీరు కూడా చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలపండి.

 

Ustaad Bhagat Singh Trailer | Pawan Kalyan | Harish Shankar | Sreeleela | Raashii Khanna

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version