Congress and BJP Rule: ‘గత కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. దేశ ఆర్థికాభివృద్ధి కుచించుకుపోయింది.. ధరలు విపరీతంగా పెరిగాయి..’ అని నాటి ప్రతిపక్ష బీజేపీ ఆడిపోసుకుంది. మా ప్రభుత్వం వస్తే ప్రజలు ఎంతో లాభపడుతారని హామీలిచ్చింది. దీంతో కాంగ్రెస్ అవినీతి పాలనకు చరమగీతం పాడి ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొదట ఐదేళ్లు ప్రభుత్వాన్ని గాడిలో పడేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయత్నాలు చేసినా రెండో దఫాలో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించారు. గత ప్రభుత్వం కంటే అధికంగా ధరలు పెంచేశారు.. గత ప్రభుత్వం కంటే అప్పులు ఎక్కువ చేస్తున్నారు.. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రజలు నానా బాధలు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గుజరాత్ లోని పటేల్ విగ్రహం తప్ప మోదీ చేపట్టిన భారీ ప్రాజెక్టు ఒక్కటైనా కనిపిస్తుందా..? అని సెటైర్లు వేస్తున్నారు.
సామాన్యుడి నుంచి ఉన్నతస్థాయిలో ఉన్నవారి వరకు ఈ ఎనిమిదేళ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏం చేసింది..? మాకెలాంటి పథకాలు అందాయి..? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే మోదీ చేసిందానికన్నా పెరుగుతున్న ధరలు, పన్నులే అధికాంగా కనిపిస్తున్నాయి. పన్నులు వసూలు చేయడమే అభివృద్ధి అని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ఇందులో భాగంగా జీఎస్టీని ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ప్రభుత్వానికి గతేడాదిలో లక్ష కోట్లు వచ్చాయి. అయితే ప్రభుత్వ దాహం తీరలేదన్నట్లు మరింత పన్నుల భారం మోపుతోంది. తాజాగా జీఎస్టీ 5 శాతం శ్లాబ్ ను తొలగించి కొత్తగా ఎనిమిది శాతం శ్లాబ్ లు తేవడానికి సన్నాహాలు చేస్తోంది.
Also Read: YCP Plenary Meeting: మహానాడుకు తలదన్నేలా ప్లీనరీ.. ముఖం చాటేస్తున్న వైసీపీ నేతలు
2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 70 ఉండేది. అప్పడు అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్ ధర 120 డాల్లరు ఉండేంది. కానీ ఇప్పుడు క్రూడాయిల్ ధర 100 డాలర్లే ఉంది. కానీ పెట్రోల్ ను రూ.120 వరకు తీసుకెళ్లారు. అయ్యోపాపం అన్నట్లు ఈమధ్య రూ.10 తగ్గించి 110 చేశారు. అయితే పెట్రోల్ ధరలు క్రూడాయిల్ ధరను భట్టి మారుతాయని చెబుతున్నా.. వాటి ధర తగ్గినప్పుడు పెట్రోల్ ధరలను ఎందుకు తగ్గించడం లేదన్నది ప్రశ్నార్థంగా మారుతుంది. యూపీఏ హయాంలో ఏటా రూ.60 వేల కోట్ల ఎక్సైజ్ టాక్స్ పెట్రో ఉత్పత్తులపై వస్తే.. ఇప్పుడు రూ.4 లక్షల కోట్లకు చేరుకుంది. కేంద్రం ఎక్సైజ్ టాక్స్ తగ్గిస్తే ఆ శాతం మేర వ్యాట్ తగ్గిపోతుంది.
ప్రతీ ఇంట్లో నిత్యవసరంగా మారిన గ్యాస్ ధర మండిపోతుంది. యూపీఏ హయాంలో రూ.350 ఉన్న గ్యాస్ ఇప్పుడు రూ.1100లకు చేరుకుంది. అందులోనూ తాజాగా సబ్సిడీనీ పూర్తిగా ఎత్తేశారు. 2014 ఎన్నికల ముందు పెట్రో,గ్యాస్ ఉత్పత్తులపై బీజేపీ నాయకులు చేసిన ఆందోళనలు ఇప్పుడు గుర్తుచేసుకుంటారో లేదో వారికే తెలియాలి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో గ్యాస్ సబ్సిడీని నగదు బదిలీగా చేశారు. దీనిని స్మృతి ఇరాని లాంటి వారు వ్యతిరేకించి ఆందోళన చేశారు. వారితో ప్రజలు కూడా గొంతెత్తారు. కానీ ఆ తరువాత అదే నగదు బదిలీని కంటిన్యూ చేస్తోంది. అయితే గ్యాస్ ధరను విపరీతంగా పెంచడంతో మళ్లీ వంట చెరుకు వైపే వెళ్తున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
సందడ్లో సడేమియా లాగా.. అసలే ప్రజలు అధిక ధరలు కుదేలవుతున్న సమయంలో కరోనా లాక్డౌన్ మరింత కుంగదీసింది. లాక్డౌన్ తో భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీసింది. ఆర్థికాభివృద్ధి దేవుడెరుగు.. ప్రాణాలను కాపాడుకోవడానికే పెద్ద కసరత్తు చేయాల్సి వచ్చింది. దీంతో జీడీపి పదకొండేళ్ల కనిష్టానికి 3.1 శాతానికి పడిపోయింది. దీంతో పేదల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పతరం కాదు. ఉపాధిలేక కూటి కోసం అల్లాడుతున్నారు. నిరుద్యోగం పెరిగి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. మొత్తానికి ఎన్డీయే పాలనలో జరిగిన కష్టనష్టాలు అన్నీ ఇన్నీ కావని జనం చర్చించుకుంటున్నారు.
Also Read:Attacks YCP Leaders On Officers: ఏపీలో అధికారులు, ఉద్యోగులపై ఆగని వైసీపీ దాడులు