Kakani Govardhan Reddy : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Kakani Govardhan Reddy ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దూకుడు కలిగిన నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒకరు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రిగా ఉండేటప్పుడు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా మైనింగ్ కేసులకు సంబంధించి ఈయన చుట్టూ వివాదాలను నడుస్తున్నాయి. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా వంటి అభియోగాలు ఆయనపై తాజాగా అభియోగాలు మోపారు ఏపీ పోలీసులు. తప్పకుండా ఆయన అరెస్టు జరిగే అవకాశం ఉంది. అయితే ఆయన కోసం నెల్లూరులో ఆయన ఇళ్ల వద్దకు వెళ్తే తాళాలు వేసి ఉండడం కనిపించింది. దీంతో కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది.
Also Read : అనిల్ కుమార్ వర్సెస్ గోవర్ధన్‌రెడ్డి.. చెప్పేవేమో గొప్పలు.. పదవి కోసమే తిప్పలు..!
* పోలీసుల కేసు నమోదు..
నెల్లూరు జిల్లా( Nellore district) పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకానిని ఏ4గా చేర్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ముగ్గురిపై కేసు పెట్టగా.. తాజాగా కాకాని తో సహా మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ6, ఏ8 గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరు పరిచారు. మిగిలిన కాకాని తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. అయితే కాకాని కోసం ఆయన ఇంటికి వెళితే తాళం వేసి ఉండడం కనిపించింది. అరెస్టు భయంతోనే ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
* అపారమైన నిక్షేపాలు..
నెల్లూరు జిల్లాలో అపారమైన క్వార్ట్జ్( quartz ) నిక్షేపాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వీటిని దొడ్డి దారిలో కైవసం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రుస్తుం మైన్స్ నుంచి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సంపదను కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఒకరికి లీజుకు ఇవ్వగా.. గడువు ముగియడంతో సర్వేపల్లి కి చెందిన వైసీపీ నాయకులు ఈ మైండ్స్ పై కన్నేశారు. ఈ మొట్ట వెనుక అప్పటి మంత్రి కాకాని హస్తము ఉందన్నది ఆరోపణ. అయితే ఈ అక్రమ మైనింగ్ ను అడ్డుకునేందుకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రయత్నించారు. అప్పట్లో సత్యాగ్రహ దీక్ష కూడా చేపట్టారు. అప్పట్లో సోమిరెడ్డి ఫిర్యాదు చేసిన పట్టించుకునే వారు కరువయ్యారు.
* రూ. 250 కోట్ల అవినీతి..
అయితే తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కేంద్ర ప్రభుత్వం స్పందించడంతో ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. మైనింగ్ శాఖ( mining department) అధికారులు అక్కడికి వెళ్లి దోచుకుపోయిన క్వార్ట్జ్ విలువ 250 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని లెక్కలు కట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మొత్తం సూత్రధారులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి అనుచరులే. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే మాజీ మంత్రి కాకాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టమైంది.
Also Read : వ్యవసాయమా.. చంద్రబాబుకు సాయమా? విజయసాయి రెడ్డి పై వైసీపీ కౌంటర్!