TPCC: కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉన్నది మూడు రాష్ట్రాల్లోనే. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఈ మూడు రాష్ట్రాలే ఇప్పుడు తెలంగాణను సాకుతున్నాయి. దీంతో ఈ రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలో పార్టీని గాడిన పెట్టేందుకు ఇన్‌చార్జిలను నియమించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి తెలంగాణ ఇన్‌చార్జిగా దీపాదాస్ మున్షీ ఉన్నారు. రెండేళ్లు పార్టీ బాధ్యలు చూస్తూ ఏఐసీసీ(AICC)కి అనుసంధాన కర్తగా పనిచేశారు. తాజాగా ఆమెస్థానంలో మీనాక్షి నటరాజన్‌ను ఏఐసీసీ నియమించింది. ఈమేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని పార్టీ నేత కేసీ.వేణుగోపాల్(KC. Venugopal)ప్రకటించారు. రాహల్‌గాంధీ(Rahul Gandhi) టీంలో కీలక సభ్యురాలిగా ఉన్న మీనాక్షి నటరాజన్, త్వరలో తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
మీనాక్షి ప్రస్థానం ఇదీ..
మీనాక్షి నటరాజన్ సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్(Madhya Pradesh). కిందిస్థాయి నుంచే పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ(NSUI), యూత్ కాంగ్రెస్, ఏఐసీసీలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా రాహుల్‌గాంధీకి అత్యంత విశ్వసనీయ నేతల్లో ఒకరిగా ఉన్నారు.
అసలు ఎందుకు మార్చారు..
తెలంగాణ ఇన్‌చార్జిగా ఉన్న కేరళకు చెందిన దీపాదాస్ మున్షీని మార్చడం ఇప్పుడు టీ కాంగ్రెస్‌లో చర్చనీయాంశహైంది. ఆమె కేరళతోపాటు, తెలంగాణకు ఇన్‌చార్జిగా ఉన్నారు. కేరళపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సీనియర్లను కలవడం లేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. దీంతో చాలా మంది దీపాదాస్ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈమేరకు కొందరు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. అన్ని రకాలుగా ఆలోచనలు చేసిన అధిష్టానం పార్టీ సీనియర్ల అభిప్రాయం మేరకు కొత్త ఇన్‌చార్జిని నియమించింది. దీంతో దీపాదాస్ మున్షీ ఇక కేరళకే పరిమితం చేసింది.
ఇతర రాష్ట్రాల్లోనూ మార్పులు
తెలంగాణతోపాటు ఏఐసీసీ పలు రాష్ట్రాలకు కూడా కొత్త ఇన్‌చార్జిలను నియమించింది. హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బిహార్ రాష్ట్రాలకు కూడా కొత్త ఇన్‌చార్జీలను నియమించింది. పంజాబ్, జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్‌లకు కొత్త జనరల్ సెక్రెటరీలను నియమించింది. తాజా నియామకాలతో ఆయా రాష్ట్రాల్లో పార్టీ మరింత బలపడుతుందని అధిష్టానం భావిస్తోంది.