CM Revanth Reddy Comments On KCR: వ్యక్తిగత దూషణలు పెరిగిపోయాయి. వ్యక్తిగత ప్రతీకారాలు ఎక్కువైపోయాయి. గిట్టని వాళ్ళ మీద రాళ్లు వేయడం.. బురద చల్లడం వంటి వ్యవహారాలు పెరిగిపోయాయి. అందువల్లే రాజకీయాలు అంటేనే ఏవగింపు కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు కానీ.. ఇప్పటివరకైతే పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇకపై బాగుపడుతుందని నమ్మకం లేదు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలను నాయకులు వ్యక్తిగత లక్ష్యంగా చేసేవారు. అని ఇప్పుడు క్రమేపీ ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ముద్రగడకు భయపడిన కూటమి.. కారణం అదే!
తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేసే రాజకీయాలకు శ్రీకారం చుట్టగా.. ఇప్పుడు ఆ పరిస్థితి చేయి దాటిపోయి.. అంతకంతకు పెరిగిపోతుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం ప్రారంభించారు. వందల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. ” లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఏం జరిగిందో మనం చూసాం. లక్ష్మీ నరసింహస్వామి రాజకీయాల కోసం ఎలా వాడుకున్నారో కూడా మనం చూసాం. అందువల్లే అలాంటి పాపాలకు పాల్పడిన వ్యక్తికి ఎలాంటి శిక్షణ దేవుడు ఇచ్చాడో మన ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజులోనే మనం చూసాం. కెసిఆర్ పాపాలు చేసింది కాబట్టే కాలు విరిగింది. ఈ విషయం నేను చెప్పట్లేదు.. ఆ పార్టీ నాయకురాలు.. ఆ ఇంటి ఆడబిడ్డ స్వయంగా తమ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెబుతోంది. భారత రాష్ట్ర సమితిలో ఉన్నది దయ్యాలు అని సొంత ఇంటి ఆడబిడ్డ చెబుతుంటే.. సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు తన వ్యవసాయ క్షేత్రంలో పడుకున్నాడు. నేను అడుగుతున్న అది బిఆర్ఎస్ కాదు.. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్యసమితి. ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్న.. అవి దయ్యాలు కాదు కొరివి దయ్యాలు.. వాటిని పొలిమేరల దాకా తరిమికొట్టే బాధ్యతను మీ సోదరుడిగా నేను తీసుకుంటా. ఆ కొరివి దయ్యాలను తరిమి కొట్టడానికి మీ వంతు సహకారం ఉండాలే. నల్లగొండ బిడ్డలుగా మీరు ముందు భాగంలో నిలబడాలే. ఆ సహకారం మీరు ఇస్తారని కోరుకుంటున్నానని” రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన దయ్యాల వ్యాఖ్యలను.. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం.
కేసీఆర్ పాపాలు చేసిండు కాబట్టే కాలు జారి పడ్డాడు – రేవంత్ రెడ్డి pic.twitter.com/j6uWxSnIMr
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2025