Star Director Rejected Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియన్ ఏ రోజు ఎలాంటి పొజిషన్లో ఉంటాడో ఎవరు చెప్పలేరు. మొత్తానికి అయితే కష్టపడిన వాళ్లు మంచి సక్సెస్ లను అందుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇప్పుడున్న హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్లే కావడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మహేష్ బాబు (Mahesh Babu) తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి(Rajamouli) తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక కెరియర్ స్టార్టింగ్ లో మహేష్ బాబు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే. అయితే అప్పట్లో టాప్ డైరెక్టర్లుగా ఉన్న కొంతమందితో సినిమాలు చేయాలని అనుకున్నాడట. కానీ ఆ దర్శకులు మాత్రం మహేష్ బాబుతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో మహేష్ బాబు వాళ్ళని లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సురేష్ కృష్ణ (Suresh Krishna), రవి రాజా పినిశెట్టి (Raviraja Pinishetty) లాంటి దర్శకులతో సినిమాలు చేయించాలని సూపర్ కృష్ణ భావించాడట. కానీ వాళ్లు మాత్రం ఇతర సినిమాలతో బిజీగా ఉండి మహేష్ బాబు సినిమాను చేయలేకపోయారు. మొత్తానికైతే ఆ తర్వాత కాలంలో మంచి సినిమాలను చేసి సక్సెస్ ఫుల్ హీరోగా మారిన తర్వాత వాళ్లు అతనితో సినిమా చేయాలని వచ్చినప్పటికి మహేష్ బాబు మాత్రం వాళ్ళని రిజెక్ట్ చేసినట్టుగా తన సన్నిహితుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతుండడం విశేషం… ప్రస్తుతం ఇండియాలో ఉన్న దర్శకులందరు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో మహేష్ బాబు చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. రాజమౌళి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు. మరి రాజమౌళితో చేస్తున్న సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మహేష్ బాబు డైరెక్ట్ గా హాలీవుడ్ లోనే సినిమాలు చేసి స్థాయికి ఎదుగుతాడు.
అక్కడి దర్శకులు కూడా ఇప్పటికే మహేష్ కి కొన్ని కథలను వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు హాలీవుడ్ స్టార్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…