Zodiac Signs : జ్యోతిష్య ప్రకారం కొన్ని గ్రహాలు రాశులు మారుతూ ఉంటాయి. కొత్త పంచాంగం ప్రకారం ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ నెలలో సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే మీనరాశిలోకి శుక్రుడు కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశించనున్నాడు. అంటే ఈ నెలలో చాలావరకు గ్రహాలు మార్కులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొన్ని రాశుల వారి ఆదాయంలో మార్పులు జరగనున్నాయి. కొందరికి అదృష్టం కూడా వరించనుంది. అయితే ఈ గ్రహాలు మారడం వల్ల మూడు రాశుల్లో మార్పులు జరగనున్నాయి. ఆ రాశులు ఏవంటే?
Also Read : ‘విశ్వావసు’ పంచాంగం ప్రకారం కొత్త పండుగలు ఇవే...
ఏప్రిల్ నెలలో మకర రాశికి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉండనున్నాయి. ఈ రాశి వారు అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గతంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారాలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగులు తమ లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతులను పొందే అవకాశం ఉంటుంది. కొందరికి జీతం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారు ఈ నెలలో శని బాధల నుంచి విముక్తి పొందుతారు. దీంతో ఉల్లాసంగా ఉండగలుగుతారు
మిధున రాశి వారికి ఈనెల మొత్తం ఆదాయం ఊహించినంతగా ఉంటుంది. ఉద్యోగులు కెరీర్లో పురోగతి సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు శుభవార్త వింటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న పనిని వెంటనే పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యంగా ఉండగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. అయితే పెద్దల సలహా తీసుకొని పెట్టుబడులు పెట్టాలి. విద్యార్థుల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి వారు అనుకున్న పనులను వెంటనే పూర్తి చేస్తారు. మీరు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి తేలుతారు. కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట్లోకి చుట్టాలు రావడంతో సందడిగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారం కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. అయినా మాటలు మాధుర్యంతో వీటిని పరిష్కరించుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మిగతా రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది. అయితే మీరు ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు. ప్రతి శనివారం లేదా మంగళవారం శని కోసం పూజలు చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం పొందుతారు. దీంతో కొన్ని దోషాల నుంచి విముక్తి పొందుతారు. అలాగే ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మొత్తంగా ఈ నెలలో పై మూడు రాశుల వారికి సంతోషంగా ఉంటుంది. మిగతావారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి.
Also Read : నిత్యానంద స్వామి చనిపోయారా? ఇందులో నిజమెంత?