CM Revanth Reddy: తెలంగాణ అంటే ఇక కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌తో బంధం కట్‌!

తెలంగాణలోని టీఎస్‌ అక్షరాలను టీజీగా మార్చేశారు. ఇక తెలంగాణ అధికారిక చిహ్నంలోనూ కీలక మార్పులు చేస్తున్నారు. చిత్రకారుడు రుద్ర రాజేశ్‌తో ఈమేరకు మంతనాలు జరుపుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : May 29, 2024 2:05 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: తెలంగాణ తెచ్చింది తామే.. తెలంగాణ గాంధీ తమ నాయకుడు కేసీఆర్‌.. తెలంగాణ జాతిపిత.. తెలంగాణతో తమ బంధం విడదీయరానిది.. అంటూ ఇన్నాళ్లూ ప్రచారం చేశారు గులాబీ నేతలు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతా తిరగబడింది. ఒక్కసారిగా పార్టీ పరిస్థితులు తారుమారయ్యాయి. ఇన్నాళ్లూ తెలంగాణ నినాదం తమ హక్కు అని చెప్పిన నేతలు కూడా ఇప్పుడు అధికార హస్తం గూటికి చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది చేరారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత మరింతమంది చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగతోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు కూడా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇదేసమయంలో రాష్ట్రంలో కేసీఆర్‌ ముద్ర లేకుండా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

కీలక నిర్ణయాలు..
తెలంగాణలోని టీఎస్‌ అక్షరాలను టీజీగా మార్చేశారు. ఇక తెలంగాణ అధికారిక చిహ్నంలోనూ కీలక మార్పులు చేస్తున్నారు. చిత్రకారుడు రుద్ర రాజేశ్‌తో ఈమేరకు మంతనాలు జరుపుతున్నారు. పలు నమూనాలు పరిశీలించి సూచనలు చేశారు. ప్రస్తుత లోగోలు ఉన్న కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించాలని సూచించారు. వాటిని రాచరికపు పోకడలకు చిహ్నాలుగా పేర్కొన్నారు. కొత్త లోగోలు నాగోబా జాతర, సమ్మక్క సారలమ్మ చాతరకు సంబంధించిన చిత్రాలు వచ్చేలా రూపకల్పన చేయిస్తున్నారు.

కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం..
ఇక తెలంగాణ తల్లి కేసీఆర్‌ కూతురు కవిత రూపంలో ఉందని గతంలోనే విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆ విగ్రహంలోనూ మార్పులు చేయిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేయించారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం లాంటి పోరాట యోధుల తరహాలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని తెలుస్తోంది.

తెలంగాణ గేయం
మరోవైపు తెలంగాణ అధికారిక గేయంగా అందెశ్రీ రాసిన జయ జయమే తెలంగాణ గీతాన్ని ప్రకటించారు. తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవం రోజున దీనిని ఆవిష్కరిచంబోతున్నారు. ఈ గీతంలో కొన్ని మార్పులు చేయించి ఆస్కార్‌ అవార్డు సంగీత దర్కకుడు ఎంఎం. కీరవాణితో బాణీలు కట్టించారు.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌.. తెలంగాణలో కాంగ్రెస్‌ ముద్రే ఉండాలి అన్నట్లుగా రేవంత్‌రెడ్డి కీలక మార్పులు చేస్తున్నారు. దీనిపై బీఆర్‌ఎస్‌ నేతలు మండి పడుతున్నారు. లోగోలో మార్పులపై కేటీఆర్‌ స్పందించారు. అయితే కౌంటర్‌ ఇవ్వడానికి మిగతా నేతలెవరూ సాహసం చేయడం లేదు.