Assam: బాత్‌రూమా.. పాముల పుట్టా.. ఒకటి, రెండు కాదు.. 35 సర్పాలు.. వీడియో వైరల్‌!

అసోం రాష్ట్రం నాగోన్‌ జిల్లాలోని కాలైబోర్‌ ప్రాంతానికి సమీపంలో ఓ వ్యక్తి ఇటీవలే ఇంటి నిర్మాణం చేశాడు. ఆ ఇంటి బాత్‌రూం నుంచి ఒకటి కాదు.. రెండు కాదు.. 35 సర్పాలు బయటకు వచ్చాయి. ఇంటి యజమానులు ఈ దృశ్యం చూసి భయంతో వణికిపోయారు.

Written By: Raj Shekar, Updated On : May 29, 2024 2:12 pm

Assam

Follow us on

Assam: పాము ఈ పేరు వింటేనే మన ఒళ్లు జలదరిస్తుంది. ఇక పాము కనబడితే భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భయంతో పరుగులు పెడతాం. ఒక్క పాముకే ఇలా చేస్తుంటే.. ఇక ఒకేసారి పదుల సంఖ్యలో పాములు కనిపిస్తే ఎలా ఉంటుంది.. అది కూడా బాత్‌రూంలోకి వస్తే ఇక గుండే ఆగిపోయినంత పని అవుతుంది. ఇక్కడ అదే జరిగింది. ఓ బాత్‌రూంలో 35కుపైగా సర్పాలు వచ్చాయి. వీటికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అసోంలోని కొత్త ఇంట్లో..
అసోం రాష్ట్రం నాగోన్‌ జిల్లాలోని కాలైబోర్‌ ప్రాంతానికి సమీపంలో ఓ వ్యక్తి ఇటీవలే ఇంటి నిర్మాణం చేశాడు. ఆ ఇంటి బాత్‌రూం నుంచి ఒకటి కాదు.. రెండు కాదు.. 35 సర్పాలు బయటకు వచ్చాయి. ఇంటి యజమానులు ఈ దృశ్యం చూసి భయంతో వణికిపోయారు. వెంటనే పాములు పట్టే సంజిబ్‌ దేకాకు సమాచారం అందించారు. ఆయన రగంలోకి దిగి ఇంటి బాత్రూంలోకి వెళ్లి 35 కు పైగా పాములను పట్టుకున్నాడు. వాటిని ఓ బకెట్‌లో వేసుకుని దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టాడు. దీంతో ఇంట్లోవారితోపాటు చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో వైరల్‌..
ఇంటి బాత్‌రూంలో 35కుపైగా పాములు బయటకు వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు అక్కడ పెద్ద ఎత్తున గుమికూడిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఇక పాములు పట్టే సంజీబ్‌ దేకా పాములు పట్టడం గురించి వీడియోలో మాట్లాడారు. తాను పట్టుకున్న పాముల గురించి తెలిపారు. తాను ఇటీవలే కలియాబోలోని టీ ఎస్టేట్‌లో 55 కిలోల కంటే ఎక్కువ బరువు.. 14 అడుగుల పొడవు ఉన బర్మీస్‌ కొండచిలువను పట్టుకున్నట్లు తెలిపాడు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అది బాత్‌రూమా.. లేక పాముల పుట్టాన అని కామెంట్‌ చేస్తున్నారు. పాములు పట్టుకున్న సంజీబ్‌ దేకా ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అన్ని పాములు ఒక్కసారి అక్కడకు ఎలా వచ్చాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. బాత్‌రూంలో ఉండగా వచ్చి ఉంటే టపా కట్టేవారు అంటూ కామెంట్‌ చేస్తున్నారు.