Sorghum: జొన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

మెదక్ జిల్లా రైతులకు ఈ యాసంగి 2023-24లో ఎకరాకి 12 క్వింటాళ్ల జొన్న దిగుబడి వచ్చిందట. ఐతే.. రైతుల నుంచి 8 క్వింటాళ్ల వరకే కొనాలని ఇదివరకు నిబంధనలు ఉండేవి. వాటి వల్ల రైతులకు నష్టం కలుగుతుందని భావించి ఆ నిబంధనలను సవరించి రైతులకు మేలు చేస్తుంది ప్రభుత్వం.

Written By: Swathi, Updated On : May 29, 2024 2:01 pm

Sorghum

Follow us on

Sorghum: మీరు జొన్న పంట పండిస్తున్నారా? తెలంగాణలోనే ఉంటారా? అయితే శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం జొన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. జొన్న రైతుల నుంచి 8 క్వింటాల్లు మాత్రమే కాదు 12 క్వింటాళ్ల వరకు జొన్నను కొనాలని మార్క్‌ఫెడ్‌ని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మెదక్ జిల్లా రైతులకు మేలు కలిగేలా, ప్రభుత్వ వ్యవసాయ, సహకారశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

మెదక్ జిల్లా రైతులకు ఈ యాసంగి 2023-24లో ఎకరాకి 12 క్వింటాళ్ల జొన్న దిగుబడి వచ్చిందట. ఐతే.. రైతుల నుంచి 8 క్వింటాళ్ల వరకే కొనాలని ఇదివరకు నిబంధనలు ఉండేవి. వాటి వల్ల రైతులకు నష్టం కలుగుతుందని భావించి ఆ నిబంధనలను సవరించి రైతులకు మేలు చేస్తుంది ప్రభుత్వం.

గతంలో మెదక్ జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రతి ఎకరాకీ 8 క్వింటాళ్ల జొన్నలను మాత్రమే కొనేవారు. దీని వల్ల రైతులు ఇబ్బందులు పడేవారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దామోదర రాజనరసింహ, వ్యవసాయ శాఖ కార్యదర్శికి లేఖ రాసి సమస్యను పరిష్కరించాలి అని కోరారు. ఆ లేఖకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి వెంటనే స్పందించి.. ఒక్కో రైతు నుంచి మార్కెఫెడ్ ద్వారా జొన్న కొనుగోళ్లను 8 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లకు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇన్ని రోజులు కేవలం 8 క్వింటాల్లు మాత్రమే అమ్మి మిగిలిన వాటిని ఎక్కడ అమ్మాలో తెలియక ఇబ్బంది పడేవారట రైతులు. చాలా మంది ఆ పంటను రోడ్లపై, మార్కెట్లలో అలాగే వదిలేసేవారు. ఇప్పుడు మంత్రి దామోదర రాజనరసింహ తీసుకున్న ప్రత్యేక చొరవతో తమకు మేలు జరుగుతుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నిర్ణయం వల్ల వారు అప్పుల నుంచి విముక్తి పొందుతున్నాం అంటూ కొనియాడుతున్నారు.