https://oktelugu.com/

CM Revanth Reddy : ప్రతీనెల 22వేల కోట్లు అవసరం.. ఎక్కడ నుంచి తెచ్చేది.. దేనికెంతో చెప్పిన సీఎం రేవంత్ సార్!

ప్రస్తుతం ఎల్ ఆర్ ఎస్ ను తెర పైకి తీసుకొచ్చినప్పటికీ.. ఆదాయంలో కదలిక ఉంటుందనే నమ్మకం లేదు.. ఇంకా మిగతా శాఖల పనితీరు CM Revanth Reddy : కూడా ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసుకున్న అంచనాకు.. వస్తున్న ఆదాయానికి లెక్క సరిపోడం లేదు. బడ్జెట్ భారీగానే ఉన్నప్పటికీ.. కేటాయింపులు లేకపోవడంతో అవి లెక్కలకే పరిమితమైపోయాయి. ఇలా ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిబంధకాలే ఎదురవుతున్నాయి.

Written By: , Updated On : February 26, 2025 / 08:08 PM IST
CM Revanth Reddy

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy  : “రేవంత్ రెడ్డి అధికారంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు కూడా పరిమితికి మించి తీసుకొస్తున్నారు. ఇలా అయితే తెలంగాణ పుట్టి మునగడం ఖాయం. అప్పులు లక్షల కోట్లు దాటుతున్నాయి. కానీ ఇంతవరకు ఒక ప్రాజెక్టు కూడా కొత్తది ప్రారంభించింది లేదు. ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదు.” ఇవీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి చేస్తున్న ఆరోపణలు.

రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిపోయింది.. ప్రస్తుతం ఎల్ ఆర్ ఎస్ ను తెర పైకి తీసుకొచ్చినప్పటికీ.. ఆదాయంలో కదలిక ఉంటుందనే నమ్మకం లేదు.. ఇంకా మిగతా శాఖల పనితీరు కూడా ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసుకున్న అంచనాకు.. వస్తున్న ఆదాయానికి లెక్క సరిపోడం లేదు. బడ్జెట్ భారీగానే ఉన్నప్పటికీ.. కేటాయింపులు లేకపోవడంతో అవి లెక్కలకే పరిమితమైపోయాయి. ఇలా ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిబంధకాలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నట్టు గొప్పగా చెబుతున్నప్పటికీ.. ఇప్పటికీ రుణమాఫీ కాని రైతులు ఎంతోమంది ఉన్నారు. ఉచిత గ్యాస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. సన్న ధాన్యం పండించిన రైతులకు బోనస్ కూడా అంతంతమాత్రంగానే వచ్చింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతు కూలీలకు మాత్రమే అందించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన పథకాల్లో సింహభాగం అమలుకు నోచుకోవడం లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి రోజుకో తీరుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. అయితే ఈ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి కౌంటర్ కరువు అవుతోంది. అయితే తొలిసారిగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : పార్టీకి కట్టుబడి పనిచేయాలి.. నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ప్రతినెల 22 వేల కోట్లు అవసరం..

ఢిల్లీలో ప్రధానమంత్రి ని కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. వస్తున్న ఆదాయం గురించి వివరించారు. 22,500 కోట్లకు గానూ ప్రతీ నెలకు ప్రస్తుతం ఆదాయం 18,500 కోట్లు మాత్రమే వస్తోంది. ఉద్యోగుల వేతనాలకు 6,500 కోట్లు చెల్లిస్తున్నాం. వడ్డీలకు 6,800 కోట్లు కడుతున్నాం. మిగతా డబ్బును ప్రాజెక్టులు, ఇతర వాటి కోసం ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రం ఆదాయం ప్రతినెల 22 వేల కోట్లకు పెరిగే విధంగా కృషి చేస్తున్నాం. ఆర్థికపరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ పథకాల అమలును నిలిపివేయడం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల వడ్డీలకు దాదాపు 6,800 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇది భారంగా ఉన్నప్పటికీ.. ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తున్నాం.. ఒక్క రూపాయి కూడా వృధాగా ఖర్చు చేయడం లేదు. అందువల్లే ప్రభుత్వపరంగా పథకాల అమలు వేగంగా జరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ ఆర్థికంగా అద్భుత ప్రగతి సాధిస్తోంది. ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు కనుక పూర్తయితే తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఓడించడానికి ‘పాకిస్తాన్’ను ‘బండి ’ వాడేసాడా?