CM Revanth Reddy
CM Revanth Reddy : కాంగ్రెస్‌లో స్వేచ్ఛ, స్వతంత్రంతోపాటు గ్రూపు రాజకీయాలు ఎక్కువ. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సమయంలో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. అయితే 2023 ఎన్నికల నాటికి అవన్నీ సర్దుమణిగాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఇప్పుడు మరోమారు గ్రూపు రాజకీయాలతోపాటు సొంత పార్టీపైనే ప్రజాప్రతినిదులు విమర్శలు చేయడం సంచలనంగా మారింది. దీంతో అధికార పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తయితే.. పార్టీలో కీలక పరిణామాలు మరో ఎత్తు అన్నట్లుగా మారాయి. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో.. నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గ్రూపు రాజకీయాలపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది.
మొన్న గ్రూప్.. నిన్న విమర్శలు..
ఇటీవలే పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లంచ్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది సంచలనంగా మారింది. సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన బీసీ సదస్సులో రెడ్డి సామాజికవర్గాన్ని ధూషించడం, బీసీ గణన నివేదికను తప్పు పట్టడం చర్చనీయాంశమయ్యాయి. ఈ తరుణంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం ఫిబ్రవరి 6న జరిగింది. పార్టీ లైన్ దాటుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి సీఎంతోపాటు పార్టీ తెలంగాణన్‌చార్జి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
కఠిన చర్యలే..
పార్టీ లైన్‌దాటి ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అంతర్గతంగా చర్చించాలని షూచించారు. నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. అధిష్టానంతో మాట్లాడాలనుకుంటే తానే స్వయంగా రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు.
సీక్రెట్ మీటింగ్‌లు పెడితే చర్యలు..
ఇక పార్టీలో ఎవరైనా రహస్య సమావేశాలు పెట్టినా.. అంతర్గత విషాయలపై బయట మాట్లాడినా, చర్చించిన కఠిన చర్యలు ఉంటాయని దీపాదాస్ మున్షి హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలం అవుతున్న ఎమ్మెల్యేలను మందలించారని తెలిసింది. పనితీరు మార్చుకోవాలని సూచించారని సమాచారం. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసినా.. అనుకున్న ప్రచారం జరుగడం లేదని తెలిపారు.
సమస్యలు ఉంటే పార్టీలోనే మాట్లాడాలి..
ఇక పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే పీసీసీ చీఫ్, సీఎం, పార్టీ ఇన్‌చార్జితోనే మాట్లాడాలని సూచించారు. నాలుగు గోడల మధ్య జరిగే చర్యలు, మంతనాలు బయట పెట్టొద్దన్నారు. నహస్య సమావేశాలు పెడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు మధ్య గ్యాప్, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్‌పైనా ఈ సమావేశంలో చర్చించారు.