https://oktelugu.com/

Chhaava Movie : 500 కోట్ల మార్క్ ను టచ్ చేయబోతున్న ఛావా…తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చేది అప్పుడేనా..?

Chhaava Movie  :చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకున్న ఒకే ఒక హీరో విక్కీ కౌశల్...

Written By: , Updated On : February 26, 2025 / 07:54 PM IST
Chhaava Movie

Chhaava Movie

Follow us on

Chhaava Movie : బాలీవుడ్ ఇండస్ట్రీ కి గత కొన్ని రోజుల నుంచి సరైన సక్సెస్ అయితే లభించడం లేదు. ఇక ఎట్టకేలకు విక్కీ కౌశల్ (Vicky Koushal) హీరోగా వచ్చిన ఛావా(Chaava) సినిమా మంచి విజయాన్ని సాధించి భారీ కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు సాగుతుంది. ఇక శివాజీ కొడుకు అయిన శంబాజీ మహారాజ్ (Shambhaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తూ ముందుకు సాగుతుంది…ఇక ఇప్పటివరకు ఈ సినిమా 480 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. తొందర్లోనే 500 కోట్ల మార్కును కూడా అందుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదిలా ఉంటే చాలామంది తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయమని కోరుతున్నారు. వీళ్ళ డైమండ్ కు స్పందించిన సినిమా యూనిట్ ఈ మూవీని తెలుగు వర్షన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాని చూడడానికి యావత్ తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఛత్రపతి మహారాజ్ కి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన అంటే పడి చచ్చిపోయే వీరాభిమానులు సైతం ఆయనకు ఉన్నారు. కాబట్టి ఆయన కొడుకు అయిన శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని చూడడానికి ఇప్పటికే తెలుగులో ఉన్నా చాలా మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక వాళ్ళ ఆసక్తిని గమనించిన సినిమా మేకర్స్ మార్చి 7వ తేదీ నుంచి ఈ సినిమా తెలుగు వర్షన్ అందుబాటులో ఉంచుతున్నారు…ఇక విక్కీ కౌశల్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా 500 కోట్ల మార్కును కూడా టచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటివరకు ఈయనకు ఒక్క 100 కోట్ల సినిమా కూడా లేదు.

Also Read : ఛావా కోసం విక్కీ కౌశల్ అంత కష్టపడ్డడా..?ఆ ఒక్కటి మాత్రం చేయలేకపోయాడట

కానీ ఛావా(Chaava) సినిమాతో ఆయన నటనకు మంచి గుర్తింపు రావడమే కాకుండా 500 కోట్ల మార్క్ ను టచ్ చేసిన హీరోగా నిలువబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అక్కడ స్టార్ హీరోలు ఎవరికీ సాధ్యం కానీ ఒక మ్యాజిక్ ని అయితే విక్కీ కౌశల్ క్రియేట్ చేశారనే చెప్పాలి.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే డామినేషన్ ను తట్టుకొని బాలీవుడ్ ఇండస్ట్రీని కొంతవరకు కాపాడినట్టుగా తెలుస్తోంది…మరి కొంత మంది అయితే కొన ఊపిరితో కొట్టుకుంటున్న బాలీవుడ్ కి విక్కీ కౌశల్ ఊపిరి పోశాడు అంటూ ప్రశంసిస్తున్నారు.

Also Read : మోక్షజ్ఞకు హ్యాండ్ ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ, స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీకి సిద్ధం