CM Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ రహిత పార్టీ. ఎప్పుడూ కయ్యాలే. ఒకరి ఎదుగుదలను మరొరకు ఓర్వలేరు. ఎదుగుతున్న నేతను కిందకు లాగే ప్రయత్నం చేస్తారు. ఇక పార్టీలో అంతర్గత స్వేచ్ఛ పేరుతో గ్రూపు రాజకీయాలను ఎంకరేజ్ చేస్తారు. పదవి రాకుంటే పార్టీలో చిచ్చు పెడతారు. ఇలా అనేక రకాల నేతలు కాంగ్రెస్‌లో ఉన్నాయి. అయితే వైఎస్సార్ సీఎం అయ్యాక.. గ్రూపు రాజకీయాలు చాలా వరకు తగ్గాయి. అందరినీ వైఎస్సార్ కంట్రోల్‌లో పెట్టారు. అయితే తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియమితులయ్యాక మళ్లీ పాత కాంగ్రెస్ కనిపించింది. రేవంత్ వ్యతిరేకులంతా గ్రూపు కట్టారు. కొందరు పార్టీని వీడారు. ఇలాంటి తరుణంలో రేవంత్ అందరినీ ఏకం చేస్తూ.. పార్టీని ఏకతాటిపైకి తెచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. అయితే అందరినీ కలుపుకుని పార్టీని గెలిపించిన రేవంత్‌రెడ్డి.. సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతపై మాత్రం గుర్రుగా ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఫాంహౌస్‌లు కట్టుకున బీఆర్‌ఎస్ నేతల పేర్లు చెబుతూ మధ్యలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆత్మగా గుర్తింపు పొందిన కేవీపీ.రామచందర్‌రావు పేరు కూడా ప్రస్తావించారు. దీంతో రేవంత్‌రెడ్డి, కేవీపీకి మధ్య గొడవేంటి.. ఇద్దరికీ ఎక్కడ చెడింది అన్న చర్చ జరుగుతోంది.
తెరవెనుక కుట్రలు..
సీఎం రేవంత్‌రెడ్డి కేవీపీ అక్రమ ఫామ్‌హౌల నిర్మాణం గురించి ప్రస్తావించడంతో కేవీపీ కూడా అంతే స్పీడ్‌గా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్‌లో తన చరిత్ర అంటూ పెద్ద లేఖ రాశారు. అక్రమ నిర్మాణం అయితే కూల్చివేస్తానని తెలిపారు. తనను కాంగ్రెస్ ముఖ్యమంత్రి గుర్తించలేకపోవడం దృరదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌లో చాలాకాలంగా ఉన్న కేవీపీ.. వైఎస్ హయాంలో చాలా కీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ మాత్రమే నడిపిస్తారనే నమ్మకం పెంచారు. పార్టీలో పదవులు కూడా అనుభవించారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత పార్టీకి తీరని నష్టంచేశారు. అయితే రేవంత్ కోపానికీ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కేవీపీని ప్రత్యేకంగా ప్రస్తావించారన్న చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్‌తో దోస్తీ..
కేవీపీ కాంగ్రెస్ నేత అయినా.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ఆ పార్టీకి తొత్తుగా మారారన్న ప్రచారం ఉంది. తన ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీలోని లోపాలను బీఆర్‌ఎస్‌కు చెప్పారని, పార్టీ అధికారంలోకి రాకుండా చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టులు, ఇతర విషయాల్లో కేసీఆర్‌కు దిక్సూచిలా పనిచేశారని రేవంత్‌రెడ్డి నమ్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పదేళ్లు బాగా నష్టపోయిందన్న భావనలో ఉన్నారు. అందకే రేవంత్‌రెడ్డి గతంలో కూడా కేవీపీపై ఆరోపణలు చేశారు. కేవీపీది, కేసీఆర్‌ది ఒకే సామాజికవర్గం. అయితే రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై కేవీపీ తన ఫాంహౌస్ గురించి వివరణ ఇచ్చుకోకుండా కాంగ్రెస్‌లో తన చరిత్ర చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డికి ఉన్న అనుమానాలు నివృత్తి చేసేలా భారీ లేఖ రాశారు.
హైకమాండ్‌కు ఫిర్యాదు..
ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో హైడ్రా కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు సోదరుడి ఫాంహౌస్‌ను కూల్చివేసింది. మొట కూల్చింది ఇదే ఇల్లు. దీంతో కేవీపీ సీఎం రేవంతరెడ్డిపై కాంగ్రెస్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రేవంత్ దూకుడును అడ్డుకోవాలని చూశారు. సీనియర్లను చెర్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ విషయాలు తెలుసుకున్న రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్ నేత అయిన కేవీపీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.