Tirumala Laddu : మూడు చేతులు.. 3300 కిలోమీటర్లు.. రూ.30 ధర తక్కువ.. టీటీడీ నెయ్యిలో గోల్ మాల్

ఎక్కడైనా, ఏ వస్తువు రవాణా అయినా పెరిగితే.. దాని ధర పెరుగుతుంది. కానీ టీటీడీ నెయ్యి విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. నెయ్యి మూడు చేతులు మారింది. 3300 కిలోమీటర్ల ప్రయాణ భారం పెరిగింది. అయినా సరే కిలో నెయ్యి దగ్గర రూ.30 ధర తగ్గడం విశేషం.

Written By: Dharma, Updated On : October 5, 2024 11:23 am

Tirumala Laddu

Follow us on

Tirumala Laddu : టీటీడీ లడ్డు వివాదం సీరియల్ ఎపిసోడ్ లా కొనసాగుతూనే ఉంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మధ్యే మార్గంగా సిబిఐ పర్యవేక్షణలో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు అధికారులతో సంయుక్తంగా ఈ ప్రత్యేక సిట్ ఏర్పాటు కానుంది. అయితే ఈ వివాదం పై బహిరంగంగా మాట్లాడవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా సరే తిరుపతి లడ్డు తయారీకి సంబంధించి వాడిన నెయ్యి విషయంలో ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. అయితే ఈ నెయ్యిలో కల్తీ జరిగిందన్నది ఎన్డీడీబీ ల్యాబ్ నిర్ధారించింది. దీనిపైనే ప్రస్తుతం వివాదం నడుస్తోంది. అయితే ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసింది ఏఆర్ డెయిరీ కాదని తాజాగా తేలడం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ నెయ్యికి ఉత్తరాఖండ్లో మూలాలు ఉన్నట్లు తెలుస్తోంది. కిలో నెయ్యి 355 రూపాయలకు కొనుగోలు చేసి.. టీటీడీకి 320 రూపాయలకు అందిస్తున్నట్లు తేలడం కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కిలో దగ్గర 35 రూపాయల చొప్పున నష్టం భరించి ఏకంగా 10 లక్షల కిలోల నెయ్యి పంపిణీ చేయడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. భారీగా కల్తీ జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమిటన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఉత్తరాఖండ్లోని భోలే బాబా డెయిరీ
నుంచి తెప్పించి.. ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నట్లు.. మాయ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి.దీని వెనుక వేరే కథ ఉన్నట్లు ప్రచారం ప్రారంభమైంది.

* అంత సామర్థ్యం ‘ఏఆర్’ కు లేదు
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి.. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ నెయ్యిని ఉత్పత్తి చేసేది. అయితే టీటీడీ అవసరానికి మేరకు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఈ సంస్థకు లేదు. అందుకే వైష్ణవి డెయిరీ అనే మరో సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వైష్ణవి డెయిరీలో నెయ్యి తయారీ కావడం లేదు. తిరుపతికి 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్న.. నెయ్యి మాఫియా కు పెట్టింది పేరైన ఉత్తరాఖండ్లోని భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లు తేలింది. అక్కడి నుంచి వైష్ణవి డెయిరీకి తీసుకొచ్చి..ఇక్కడ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఆర్ డెయిరీ కి తరలించే వారని తేలడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఒకవైపు తక్కువ ధరకు నెయ్యిని కొనుగోలు చేయడం.. వేలాది కిలోమీటర్ల రవాణా చార్జీలు భరించడం చూస్తుంటే కల్తీ వ్యవహారం తప్పకుండా జరిగి ఉంటుందన్న అనుమానం ప్రతి ఒక్కరిలో మెదులుతోంది.

* రికార్డుల్లో చూపి
అయితే రికార్డుల్లో మాత్రమే వైష్ణవి డెయిరీ భోలేబాబా డెయిరీ నుంచి ఏఆర్ డెయిరీ కొన్నట్లు చూపించారు. ఆ రెండు డెయిరీలు కలిపి ఈ దందాను నడిపాయని అర్థమవుతుంది. భోలే బాబా డెయిరీలో డైరెక్టర్లుగా ఉన్న విపిన్ జైన్, పొమిల్ జైన్ లే వైష్ణవి డెయిరీలో డైరెక్టర్లుగా ఉన్నారు. వీరిద్దరూ 2024 జనవరి 18న వైష్ణవి డెయిరీలో డైరెక్టర్లుగా చేరారు. దీంతో ఈ అనుమానాలన్నింటికీ బలం చేకూరుతున్నాయి. 35 రూపాయలకు కొన్న నెయ్యిని తిరుపతిలోని వైష్ణవి డెయిరీకి తీసుకొచ్చారు. అక్కడ నుంచి తమిళనాడులోని దిండిగల్ లోని ఏ ఆర్ డెయిరీకి.. అక్కడి నుంచి మళ్లీ తిరుపతికి.. ఇలా3300 కిలోమీటర్లు గా ప్రయాణించి.. కిలో దగ్గర 30 రూపాయల ధర తగ్గించి.. నెయ్యి అందించారంటే.. దీని వెనక ఎంత పెద్ద మాయాజాలం ముందు అర్థం అవుతోంది. టీటీడీ పెద్దలు కుమ్మక్కు కాకుంటే ఇంత పెద్ద గోల్మాల్ సాధ్యమా అన్న ప్రశ్న వినిపిస్తోంది.