Pawan Kalyan VS Udayanidhi Stalin : ఇద్దరూ పూర్వాశ్రమంలో స్టార్ హీరోలే. రాజకీయాల్లోకి వచ్చారు. రెండు వేరువేరు రాష్ట్రాలకు డిప్యూటీ సీఎంలు అయ్యారు. ఒకాయన నాలుగు నెలల కిందట ఆ పదవిలోకి రాగా.. మరొకరు నాలుగు రోజుల కిందటే ఆ బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య హోరాహోరి పోరు ప్రారంభమైంది. జాతీయస్థాయిలో ఆకట్టుకుంటుంది. గతంలో సనాతన ధర్మంపై ఉదయ నిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబిగించారు పవన్ కళ్యాణ్. విభిన్నదారుల్లో వెళ్తున్న ఇద్దరు పొరుగు రాష్ట్రాలకు డిప్యూటీ సీఎంలు కావడం విశేషం. తమిళనాడు మంత్రిగా ఉన్నప్పుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. హిందూ సమాజం ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు పవన్. దీక్ష విరమణ సభలో సనాతన ధర్మంపై గట్టిగానే తన వాదనలు వినిపించారు. కొందరు వైరస్ తో పోల్చారని.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చూశారని.. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ వ్యాఖ్యానించారు పవన్. అయితే దీనిపై నేరుగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడలేదు. వెయిట్ అండ్ సీ అంటూ బదులు ఇచ్చారు. త్వరలో పవన్ వ్యాఖ్యలపై పోరాడుతానంటూ పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
* డీఎంకే నుంచి సంకేతాలు
వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ వివాదంలో డీఎంకే ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఒకరు పవన్ కామెంట్స్ పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. డీఎంకే ఎప్పుడు ఏ మతాన్ని టార్గెట్ చేసుకోలేదని స్పష్టం చేశారు. కుల వివక్షతో పాటు అంటరానితనంపై, కులపరమైన వేధింపుల పైన ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. అయితే సనాతన ధర్మంలో ఇవన్నీ ఉండడంతో డీఎంకే పోరాడుతుందన్న సంకేతాలను ఇచ్చారు.
* వెయిట్ అండ్ సీ అంటున్న స్టాలిన్ వారసుడు
తిరుపతిలో పవన్ హాట్ కామెంట్స్ చేసిన తర్వాత.. మీడియా దృష్టి అంతా ఉదయనిధి స్టాలిన్ పై పడింది. పవన్ వ్యాఖ్యలపై స్పందించాలని వారు కోరారు. దీనికి ఉదయ నిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ అంటూ స్మూత్ గా సమాధానం చెప్పారు. అంటే ఈ విషయంలో తమ వ్యూహం ఉందని సంకేతాలు ఇచ్చారు. మరోవైపు డిఎంకె ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీ. అంటే మాకు రోజులు వస్తాయి అని ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించినట్టు ఉంది. మున్ముందు ఇది జాతీయస్థాయిలోపెద్ద ఫైట్ కు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషణలు మొదలయ్యాయి.