Chain Snatching in Warangal: ఆమె పేరు ప్రేమలీల. స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూర్ మండలం మాటేడు. భర్తతో కలిసి ఉన్న కొద్దిపాటి వ్యవసాయం చేస్తూనే.. అప్పుడప్పుడూ ఆమె వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటుంది. సోమవారం వ్యవసాయ పనులకు వెళ్తుండగా ఆమె వెనుక బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకసారిగా దారుణానికి పాల్పడ్డారు. ఆమె మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు లాక్కున్నారు.
Also Read: ఓవైసీ కాలేజీని కూల్చరు.. రజినీకాంత్ ప్రశ్న.. కాంగ్రెస్ కు ఇక్కడే డ్యామేజ్
పుస్తెలతాడు లాక్కుని వెళ్తుంటే ఆమె కేకలు వేసింది. అదే సమయంలో అటువైపుగా వస్తున్న గ్రామస్తులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో గ్రామస్తులు ఆ ముఠాను వెంబడించారు. తొర్రూరు సరిహద్దుల్లో వారిని పట్టుకున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక పామాయిల్ తోటలోకి వారిని తీసుకెళ్లారు. అక్కడ గ్రామస్తులు వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read:భార్య చీపురుతో కొట్టడంతో కమెడియన్ ఆత్మహత్య
వీరంతా కొంతకాలంగా ముఠాగా ఏర్పడి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. ప్రేమలీల పై కూడా ఇదే విధంగా దాడి చేసి పుస్తెలతాడు లాక్కున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తూ వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే గతంలో కూడా వీరు ఇదేవిధంగా చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది.. అంతేకాదు పలు నేరాలలో కూడా వీరు పాలుపంచుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో మాటేడు లో కలకలం నెలకొంది. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం ఇదేవిధంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ గ్రామంలో చోరీ చేసింది. అప్పట్లో ఆ ఘటన సంచలనం సృష్టించింది. మళ్లీ ఇన్నాళ్లకు దొంగలు ఒక మహిళ పుస్తెలతాడు లాక్కుని వెళ్లడం.. గ్రామస్తులు పట్టుకోవడంతో కలకలం నెలకొంది.
అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ముఠాను పట్టుకున్న గ్రామస్తులు
ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడు లో అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ముఠాను గ్రామస్తులు పట్టుకున్నారు.
మాటేడు గ్రామానికి చెందిన ప్రేమలీల వ్యవసాయ పనులకు వెళ్తుండగా..అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ముఠా ఆమె… pic.twitter.com/ha57ObWpWd
— OkTelugu (@oktelugunews) August 11, 2025