spot_img
HomeతెలంగాణHarish Rao: 17 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి హరీష్ రావు.. సోషల్ మీడియా హోరెత్తుతోంది.. అసలు...

Harish Rao: 17 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి హరీష్ రావు.. సోషల్ మీడియా హోరెత్తుతోంది.. అసలు నిజం ఇదీ

Harish Rao: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో కీలక నేత హరీశ్‌రావు. ఇటీవలే గులాబీ బాస్‌ కేసీఆర్‌ హరీశ్‌రావును అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా నియమించారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, హరీశ్‌ కలిసి అధికార కాంగ్రెస్‌ను గడగడలాడిస్తున్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావుపై తాజాగా పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఆయన బీజేపీలోచేరుతారన్న వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే వీటిని బీఆర్‌ఎస్‌ ఖండించింది. ఇలాంటి అసత్యాలు స్వార్థ లాభాల కోసం కొందరు వ్యాప్తి చేస్తున్నారని, ప్రజలు దీన్ని విశ్వసించవద్దని స్పష్టం చేసింది.

ప్రచారం వెనుక వాస్తవాలు..
సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఒక వాట్సాప్‌ సందేశం ప్రకారం హరీశ్‌ రావుపై ప్రచారానికి ప్రధాన కారణం. ఇందులో హరీశ్‌రావు ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్‌ షాతో సమావేశమైనట్లు ఉంది. ఇందులో 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీలోకి అడుగుపెట్టబోతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ సమాచారం ఎలాంటి ఆధారం లేకుండా ప్రచారం చేస్తున్నారు.

రాజకీయ ప్రభావం..
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉండగా, 10 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు, నాయకులు పార్టీని వదిలి «అధికార కాంగ్రెస్‌లో చేరారు. వెళ్లారు. ఈ క్రమంల హరీశ్‌ రావు వంటి సీనియర్‌ నాయకుడు బీజేపీవైపు చూస్తున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. వాట్సాప్‌ మెస్సేజ్‌ ఇది నిజమే అన్నంతగా ఈసారి వైరల్‌ అవుతోంది.

పట్టుకోసం బీజేపీ ప్రయత్నం..
ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్రంలో పట్టు బలోపేతం కావాలనుకుంటోంది. 2029 నాటికి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలే హరీశ్‌రావు పార్టీ మార్పు ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపు తీసుకొస్తుందని కమలం నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే బీఆర్‌స్‌ తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఇది ‘చిల్లర’ రాజకీయాలుగా అభివర్ణించింది. తమ నాయకులు దృఢంగా ఉన్నారని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రచారంపై హరీశ్‌రావు స్పందించకపోవడం కొసమెరుపు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper